టీమిండియా జెర్సీపై పాకిస్తాన్ పేరు! ఒప్పుకోని బీసీసీఐ... ఆసియా కప్ 2023 టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నా...

Published : Aug 30, 2023, 04:48 PM IST

క్రికెట్‌ మాత్రమే కాకుండా ఏ క్రీడలు అయినా జెర్సీ మీద ఆ క్రీడలకు సంబంధించిన లోగోతో పాటు ఏ దేశంలో జరిగితే ఆ దేశం పేరు ముద్రించడం ఆనవాయితీ. అయితే పాకిస్తాన్‌‌ ఆతిథ్యం ఇస్తున్న ఆసియా కప్ 2023 టోర్నీలో మాత్రం ఈ ఆనవాయితీ కొనసాగడం లేదు..  

PREV
16
టీమిండియా జెర్సీపై పాకిస్తాన్ పేరు! ఒప్పుకోని బీసీసీఐ... ఆసియా కప్ 2023 టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నా...

వాస్తవానికి ఆసియా కప్ 2023 టోర్నీ మొత్తాన్ని పాకిస్తాన్‌లోనే నిర్వహించాల్సింది. అయితే ఇరుదేశాల మధ్య సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో భారత జట్టు, పాక్‌లో పర్యటించేందుకు అంగీకరించలేదు. దీంతో ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందే హైడ్రామా మొదలైంది..
 

26

భారత జట్టు, ఆసియా కప్ 2023 టోర్నీ కోసం పాకిస్తాన్‌కి రాకపోతే, పాక్ జట్టు, వన్డే వరల్డ్ కప్‌ కోసం ఇండియాలో అడుగుపెట్టదని పాక్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. అయితే వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ముందు పీసీబీ పప్పులు ఉడకలేదు..

36

అనేక సమావేశాల అనంతరం పాకిస్తాన్‌లో 4, శ్రీలంకలో 9 మ్యాచులు పెడుతూ హైబ్రీడ్ మోడల్‌లో ఆసియా కప్ 2023 నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకరించింది. నిజానికి బీసీసీఐ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ కలిసి పీసీబీని హైబ్రీడ్ మోడల్‌కి ఒప్పుకునేలా చేశారు..

46

పాకిస్తాన్‌లో జరగాల్సిన ఆసియా కప్ కావడంతో ఈ టోర్నీలో పాల్గొనే 6 జట్ల జెర్సీలపై ‘ఆసియా కప్- పాకిస్తాన్ 2023’ అని లోగో ముద్రించాల్సి ఉంది. అయితే దీనికి బీసీసీఐ అంగీకరించలేదు. శత్రుదేశం పేరుని భారత క్రికెటర్ల జెర్సీలపై ముద్రిస్తే, అభిమానులు ఒప్పుకోరని గోల చేసింది..

56

పాకిస్తాన్‌తో పాటు శ్రీలంక కూడా ఆసియా కప్‌కి ఆతిథ్యం ఇస్తుండడంతో పాక్ పేరు లోగో కింద రాయడం కరెక్ట్ కాదని వాదించింది. దీంతో హోస్ట్ కంట్రీ పేరు లేకుండానే ఆసియా కప్ లోగోతో మ్యాచులు జరగబోతున్నాయి. 

66
India vs Pakistan Last Over

ఆసియా కప్ 2023 టోర్నీ ఎలాగోలా ప్రారంభం అయిపోయింది. దీంతో పాకిస్తాన్‌లో జరగాల్సిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గురించి చర్చ మొదలైంది. రెండేళ్ల తర్వాత పాక్‌లో పర్యటించేందుకు టీమిండియా ఒప్పుకుంటుందా? లేక దాన్ని కూడా పాక్ నుంచి తరలించేలా ఐసీసీని ఒప్పిస్తుందా? అనేది వేచి చూడాలి.. 

click me!

Recommended Stories