విదేశాల్లో కంటే ఇండియాలో బ్యాటింగ్ చేయడమే చాలా కష్టం... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

Published : Aug 30, 2023, 03:13 PM IST

ఇండియాలో అదరగొట్టే భారత బ్యాటర్లు, విదేశాల్లో బ్యాటింగ్ చేయాల్సి వస్తే మాత్రం తేలిపోయేవాళ్లు. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మది ఇదే కథ. స్వదేశంలో 83+ యావరేజ్‌తో టెస్టుల్లో పరుగులు చేసిన రోహిత్ శర్మ, విదేశాల్లో మాత్రం 37 సగటును దాటలేకపోయాడు..

PREV
18
విదేశాల్లో కంటే ఇండియాలో బ్యాటింగ్ చేయడమే చాలా కష్టం... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

2021 దాకా విదేశాల్లో ఒక్క టెస్టు సెంచరీ కూడా చేయలేకపోయాడు రోహిత్ శర్మ. ఎట్టకేలకు ఇంగ్లాండ్ టూర్‌లో మొదటి విదేశీ టెస్టు సెంచరీ అందుకున్న రోహిత్, ఫామ్‌లో లేని వెస్టిండీస్‌పై రెండో ఫారిన్ సెంచరీ అందుకున్నాడు..

28


2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత గత నాలుగేళ్లలో కేవలం 3 వన్డే సెంచరీలు మాత్రమే చేశాడు రోహిత్ శర్మ. వన్డే ఫార్మాట్‌లో 10 వేల పరుగులకు 163 పరుగుల దూరంలో ఉన్నాడు రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ తర్వాత అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకోబోయే బ్యాటర్‌గా నిలుస్తాడు రోహిత్..

38
Image credit: PTI

‘ఇండియాలో బ్యాటింగ్ చేయడం చాలా ఈజీ అనుకుంటారు చాలా మంది. అయితే గత కొన్నాళ్లుగా నా టెస్టు ఇన్నింగ్స్‌లను గమనించండి. ఇప్పుడు ఇండియాలో బ్యాటింగ్ చేయడం, ఓవర్‌సీస్‌లో బ్యాటింగ్ చేయడం కంటే కష్టంగా మారింది..

48
Image credit: Getty

గత 2-3 ఏళ్లుగా ఇండియాలో పిచ్ పరిస్థితులు చాలా ఛాలెంజింగ్‌గా మారుతున్నాయి. అయితే మేం ఎప్పుడూ కూడా బ్యాటింగ్ యూనిట్ పరుగుల గురించి కానీ, యావరేజ్ గురించి కానీ మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో పిచ్‌లు ఎలా ఉన్నాయో మాకు బాగా తెలుసు..

58
Image credit: PTI

అయినా నా యావరేజ్ గురించి నాకు ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే నేను చాలా భిన్నమైన ప్లేయర్‌ని. నేనెప్పుడూ కూడా రిస్క్ తీసుకోవడానికి బాగా ఇష్టపడతాను. బౌలర్లను పట్టించుకోకుండా రిస్క్ చేయడానికి ఇష్టపడుతున్నా..

68
Image credit: PTI

నెమ్మదిగా ఆడాలి, ఎక్కువ సేపు క్రీజులో ఉండాలి, 170-200 పరుగులు చేయాలని నాక్కూడా ఉంటుంది. అయితే కొన్నిసార్లు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి.
 

78
Image credit: Getty

నెమ్మదిగా ఆడి, గంట సేపు క్రీజులో ఉండి 30 పరుగులు కూడా చేయకుండా అవుటైతే, తర్వాత ఫీల్ అవ్వాల్సి ఉంటుంది.. అందుకే ఎంత సేపు క్రీజులో ఉన్నా అనే విషయాన్ని పట్టించుకోకుండా వేగంగా ఆడాలని అనుకుంటున్నా.

88
Image credit: Getty

అందుకే గత రెండేళ్లగా నా యావరేజ్ పడిపోయినా, స్ట్రైయిక్ రేట్ బాగా పెరిగింది. నేను చేసే 30-50 పరుగులు టీమ్‌కి ఎంతగా ఉపయోగపడ్డాయనేదే నాకు ముఖ్యం..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. 

Read more Photos on
click me!

Recommended Stories