2007లో టీమిండియాలోకి వచ్చిన రోహిత్ శర్మ, 2021లో కెప్టెన్సీ దక్కించుకున్నాడు. ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్‌కి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ చాలా పెద్ద ఛాలెంజ్. ఈ టోర్నీలో టీమిండియా టైటిల్ నెగ్గలేకపోతే, రోహిత్ కెప్టెన్సీ నుంచి, రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ పొజిషన్ నుంచి తప్పుకోవాల్సి రావచ్చు...
2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేకపోతోంది టీమిండియా. 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కావడంతో 2023 ప్రపంచ కప్‌లో భారత జట్టే హాట్ ఫెవరెట్...
25
‘నేనెప్పుడూ నాకంటూ క్రికెట్ చరిత్రలో స్పెషల్ ప్లేస్ ఉండాలని కోరుకోను. అది జనాల చేతుల్లోనే ఉంటుంది. నేను అంకెల కంటే ఎంజాయ్‌మెంట్‌ని ఎక్కువ కోరుకుంటాను. ఆడిన ప్రతీ మ్యాచ్, ప్రతీ మూమెంట్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేయాలని అనుకుంటా..
35
నా సంతోషం కోసమే ఆడతా. ఆడినంత కాలం అందమైన అనుభవాలను, అనుభూతులను సంపాదించుకోవడమే నా ప్రధాన లక్ష్యం. నా టీమ్ మేట్స్‌తో నాకు మంచి అనుబంధం ఉంటే చాలు. ఎన్ని పరుగులు చేశా, ఎన్ని మ్యాచులు ఆడా... అనే లెక్కలు నేను పట్టించుకోను..
45
ఏ టోర్నీ గెలవాలన్నా టీమ్ కాంబినేషన్ చాలా ముఖ్యమని మాక్కూడా తెలుసు. అయితే ప్లేయర్లు వరుసగా గాయపడుతూ ఉంటే, ఒకే టీమ్‌ని ఎలా కొనసాగించగలం? ఉన్నంతలో ఒకే టీమ్‌ని కొనసాగించేందుకు నేను, రాహుల్ భాయ్ చాలా ప్రయత్నించాం..
55
ప్రతీ సిరీస్‌కి జట్టును ప్రకటించినప్పుడు సెలక్టర్లతో, ప్లేయర్లతో మాకేం కావాలో చర్చలు జరిపాం. టీమ్‌కి సెలక్ట్ కాని ప్లేయర్లతో కూడా మాట్లాడాం. కొన్నిసార్లు టీమ్ కంటే ఏదీ ముఖ్యం కాదు. అలాంటప్పుడు కొన్ని త్యాగాలు చేయక తప్పదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..