హార్ధిక్ పాండ్యా, ధావన్‌లకు వద్దు, ఆ యంగ్ బ్యాట్స్‌మెన్‌కి కెప్టెన్సీ... శ్రీలంకలో పర్యటించే జట్టుకి...

First Published May 30, 2021, 12:41 PM IST

ఓ వైపు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్, ఆ తర్వాత టెస్టు సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌కి వెళ్తుంటే... మరోవైపు యువకులతో కూడిన భారత జట్టు శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత జట్టు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ వ్యవహారంచబోతున్నాడు.

ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా... వంటి టాప్ ప్లేయర్లు మొత్తం ఉన్నారు. దీంతో వన్డే, టీ20 స్పెషలిస్టులతో కూడిన బృందం లంకలో పర్యటించనుంది.
undefined
సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహార్, దీపక్ చాహార్, నటరాజన్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, దేవ్‌దత్ పడిక్కల్, పృథ్వీషా వంటి ప్లేయర్లు శ్రీలంకలో పర్యటించే జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
undefined
లంకలో పర్యటించే జట్టుకి సీనియర్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించాలని కొందరు అంటుంటే, లేదు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా అయితే కరెక్ట్ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఇద్దరికీ కాకుండా సంజూ శాంసన్‌కి కెప్టెన్సీ అప్పగిస్తే బాగుంటుందని అంటున్నాడు పాక్ మాజీ ప్లేయర్ డానిష్ కనేరియా.
undefined
‘శ్రీలంకలో పర్యటించే భారత రెండో జట్టుకి శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహారిస్తాడని వార్తలు వస్తున్నాయి. లేదా హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే భవిష్యత్తు దృష్ట్యా వీరిద్దరి కంటే సంజూ శాంసన్‌కి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది.
undefined
ఎలాగో సంజూ శాంసన్, రాజస్థాన్ రాయల్స్ జట్టుకి సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఈ యంగ్ టీమ్‌గా కెప్టెన్‌గా ఎంపిక చేస్తూ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ సమయానికి ఓ యంగ్ కెప్టెన్‌ను సిద్ధం చేసినట్టు అవుతుంది...
undefined
శిఖర్ ధావన్‌కి మంచి అనుభవం ఉంది. టీ20లతో పాటు వన్డేల్లోనూ అతను చాలా మంచి ప్లేయర్. లంక టూర్‌లో అతను కీలకం అవుతాడు. అయితే అతనికి కెప్టెన్సీ భారం కాకుండా ఉంటే, మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తాడు...’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు పాక్ మాజీ పేసర్ డానిష్ కనేరియా
undefined
దేశవాళీ క్రికెట్‌లో కేరళ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న సంజూ శాంసన్, భారత జట్టు తరుపున పెద్దగా రాణించలేకపోయాడు. రిషబ్ పంత్ కెరీర్ మొదట్లో నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడిన సమయంలో సంజూకి ఛాన్సులు ఇవ్వాలని డిమాండ్ వినిపించింది.
undefined
అంతర్జాతీయ కెరీర్‌ల తాను ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ బాదిన సంజూ శాంసన్, ఆ తర్వాత నిర్లక్ష్యంగా ఆడి, భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు.
undefined
ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంలో కూడా ఇలాంటి తప్పులే చేసిన సంజూ శాంసన్, ఆ తర్వాత కెప్టెన్సీలో తన తప్పులు తెలుసుకుని, బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకి విజయాలు అందించడం మొదలెట్టాడు.
undefined
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లో భారీ సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్, ఆఖరి ఓవర్ ఆఖరి బంతిదాకా విజయం కోసం పోరాడాడు..
undefined
click me!