దినేశ్ కార్తీక్ లేడు, రషీద్ ఖాన్ లేడు... కేవిన్ పీటర్సన్ సెలక్ట్ చేసిన బెస్ట్ ఐపీఎల్ 2022 టీమ్‌లో...

Published : Jun 02, 2022, 01:40 PM IST

ఆ‌ల్‌టైం వన్డే ఎలెవన్, ఆల్‌టైం టెస్టు ఎలెవన్‌లు పోయి... ఇప్పుడు సీజన్‌లో బెస్ట్ ఎలెవన్‌కి వచ్చేశారు మాజీ క్రికెటర్లు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, ఐపీఎల్ 2022 సీజన్‌కి సంబంధించిన బెస్ట్ ఎలెవన్‌ని ప్రకటించగా తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్ ఆ లిస్టులో చేరాడు...

PREV
19
దినేశ్ కార్తీక్ లేడు, రషీద్ ఖాన్ లేడు... కేవిన్ పీటర్సన్ సెలక్ట్ చేసిన బెస్ట్ ఐపీఎల్ 2022 టీమ్‌లో...

సచిన్ టెండూల్కర్ మాదిరిగానే ఈ సీజన్‌లో ఫెయిల్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఫాఫ్ డుప్లిసిస్, ఎమ్మెస్ ధోనీలకు కేవిన్ పీటర్సన్, ది బెస్ట్ టీమ్ ఆఫ్ ఐపీఎల్ 2022లో చోటు దక్కలేదు... అయితే ఈ సీజన్‌లో అదరగొట్టిన దినేశ్ కార్తీక్‌కి కూడా తన టీమ్‌లో చోటు ఇవ్వలేదు పీటర్సన్..

 

29
Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ జోస్ బట్లర్‌ని తన టీమ్‌కి ఓపెనర్‌గా తీసుకున్న కేవిన్ పీటర్సన్, అతనితో పాటు లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ క్వింటన్ డి కాక్‌ని ఓపెనర్‌గా ఎంచుకున్నాడు...

39

ఈ సీజన్‌లో 616 పరుగులు చేసి జోస్ బట్లర్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌ని వన్ డౌన్ బ్యాటర్‌గా ఎంచుకున్నాడు కేవిన్ పీటర్సన్...

49

కెప్టెన్‌గా తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌కి టైటిల్ అందించిన హార్ధిక్ పాండ్యాను తన టీమ్‌కి టూ డౌన్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ప్రకటించాడు కేవిన్ పీటర్సన్...  

59

సీజన్‌లో ఐదు హాఫ్ సెంచరీలు చేసి బౌలింగ్‌లోని అదరగొట్టిన లియామ్ లివింగ్‌స్టోన్‌ని ఐదో స్థానంలో, గుజరాత్ టైటాన్స్‌ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ మిల్లర్‌కి కేవిన్ పీటర్సన్ టీమ్‌లో చోటు దక్కింది....

69
Image credit: PTI

ఈ సీజన్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్‌, గుజరాత్ టైటాన్స్ ఫినిషర్ రాహుల్ తెవాటియాలకు కేవిన్ పీటర్సన్, ఐపీఎల్ 2022 సీజన్ బెస్ట్ టీమ్‌లో చోటు దక్కింది...

79

ఐపీఎల్ 2022లో బౌలింగ్‌లో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, పర్పుల్ క్యాప్ విన్నర్ యజ్వేంద్ర చాహాల్‌... కేవిన్ పీటర్సన్ టీమ్‌లో ప్లేస్ దక్కింది...

89

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన జోష్ హజల్‌వుడ్‌కి కూడా పీటర్సన్ టీమ్‌లో చోటు దక్కడం విశేషం. హర్షల్ పటేల్, వానిందు హసరంగ వంటి వికెట్ టేకర్స్‌ని కాదని హజల్‌వుడ్‌ని బెస్ట్ ఎలెవన్‌కి సెలక్ట్ చేశాడు పీటర్సన్...

99

మొత్తానికి కేవిన్ పీటర్సన్ ఐపీఎల్ 2022 సీజన్ బెస్ట్ టీమ్ ఇలా ఉంది: జోస్ బట్లర్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, రవిచంద్రన్ అశ్విన్, ఉమ్రాన్ మాలిక్, యజ్వేంద్ర చాహాల్, జోష్ హజల్‌వుడ్

click me!

Recommended Stories