ధోనీ అసలు మనిషేనా? ఏమోషన్స్ ఉండవా! అంత ఘోరంగా ఓడిపోతే.. సీఎస్‌కే మాజీ ప్లేయర్ కామెంట్స్...

First Published Jun 2, 2022, 12:16 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. లీగ్ చరిత్రలో తొలిసారి సీజన్‌లో 10 పరాజయాలు అందుకున్న సీఎస్‌కే, నెట్ రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉండడం వల్లే 9 స్థానానికి పరిమితమైంది. కెప్టెన్సీ మార్పులు, గాయాలు, వివాదాలు, రాజకీయాలు... చెన్నైని ఈ సీజన్‌లో అతలాకుతలం చేశాయి...

Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలో సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఎమ్మెస్ ధోనీ, ఆ తర్వాత జడేజా ఆ పొజిషన్ నుంచి తప్పుకోవడంతో తిరిగి కెప్టెన్‌‌గా బాధ్యతలు తీసుకున్నాడు...

S Badrinath

సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆ జట్టు మాజీ ఆటగాడు ఎస్ బద్రీనాథ్. ‘ధోనీలో ఓ లక్షణం నాకు బాగా ఇష్టం, కొన్ని సార్లు అదే అస్సలు నచ్చదు.. ఓ థ్రిల్లింగ్ ఫైనల్ మ్యాచ్‌లో మేం అద్భుతంగా ఆడి టైటిల్ గెలిచాం.. అతను ఏమీ మాట్లాడలేదు...

Latest Videos


ఎమోషన్ లేకుండా నిలబడ్డాడు. మ్యాచ్ అయ్యాక ట్రోఫీ తీసుకుని, వేరే వాళ్లకి ఇచ్చేసి ఓ మూలకెళ్లి నిలబడ్డాడు. మరో మ్యాచ్‌లో మేం చిత్తుగా ఓడాం... 

Image credit: PTI

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 120 పరుగులు కూడా చేయలేక, చెన్నైలోనే ఓడిపోయాం. అప్పుడు కూడా అతను ఏమీ మాట్లాడలేదు. ఎమోషన్ లేకుండా నిలబడ్డాడు. నాకు అదే ఆశ్చర్యమేసింది...

S Badrinath on Dhoni

ధోనీ అసలు మనిషేనా. విజయాలు వచ్చనప్పుడు ఉప్పొంగిపోకపోయినా, చిత్తుగా ఓడినప్పుడైనా కాస్త కూస్తో ఫీల్ అవ్వాలిగా... కానీ ఎలాంటి సందర్భాల్లో అయినా అతను కూల్ అండ్ కామ్‌గా ఉంటాడు...

S Badrinath

ఎమ్మెస్ ధోనీ సక్సెస్‌కి ఇదే కారణం. మాహీ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకుంటే, చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది... 

 ఓ మూమెంట్‌ని ఎంజాయ్ చేసేటప్పుడు ఎమోషన్స్‌ చూపిస్తే దొరికిపోతాం. అది ధోనీ దగ్గరే నేర్చుకున్నా. ఇది చాలా పెద్ద విషయం. నేను, ఈ విషయన్ని అలవర్చుకోవడానికి చాలా కష్టపడ్డా. ధోనీ పుట్టుకతో దాన్ని ఒంటబట్టించుకున్నాడు...’ అంటూ కామెంట్ చేశాడు బద్రీనాథ్... 

S Badrinath CSK

టీమిండియా తరుపున 2 టెస్టులు, 7 వన్డేలు ఆడిన బద్రీనాథ్, ఐపీఎల్‌లో సీఎస్‌కే తరుపున 2008 నుంచి 2013 సీజన్ వరకూ ఆడాడు. ఐపీఎల్‌లో 95 మ్యాచులు ఆడి 67 ఇన్నింగ్స్‌ల్లో 1441 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

click me!