రవిశాస్త్రి మనల్ని తిట్టి, ఆ మంటతో చలి కాచుకుంటాడు... రవిశాస్త్రి కోచింగ్‌ స్టైల్‌పై ఇషాంత్ శర్మ...

Published : Feb 28, 2023, 11:54 AM IST

రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో టీమిండియా బాగానే ఆడుతున్నా, రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు భారత జట్టు ఆట వేరు, ఆ డామినేషన్ వేరు. విదేశాల్లో అద్భుత టెస్టు విజయాలు అందుకుంది టీమిండియా.. ముఖ్యంగా భారత ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ అత్యంత పటిష్టంగా మారింది...

PREV
110
రవిశాస్త్రి మనల్ని తిట్టి, ఆ మంటతో చలి కాచుకుంటాడు...  రవిశాస్త్రి కోచింగ్‌ స్టైల్‌పై ఇషాంత్ శర్మ...
Image credit: Getty

2014 నుంచి 2016 వరకూ టీమిండియాకి క్రికెట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన రవిశాస్త్రి, 2017లో ఫుల్ టైమ్ కోచ్‌గా మారాడు. ఆ తర్వాత 2019లో తిరిగి ఆ బాధ్యతలను తీసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీతో రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ముగిసింది...
 

210
Ravi Shastri and Virat Kohli

రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో రెండు సార్లు ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచింది భారత జట్టు. శ్రీలంక, వెస్టిండీస్ టూర్లలో అద్భుత విజయాలు అందుకోవడమే కాకుండా టెస్టుల్లో నెం.1 టీమ్‌గా నిలిచింది. ఇంగ్లాండ్ టూర్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచి, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడింది...

310
Jasprit Bumrah, Ishant Sharma, Mohammed Shami, Bhuvneshwar Kumar, Umesh Yadav

రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్.. ఇలా ప్రపంచంలోనే అత్యంత దృఢమైన ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌గా తయారైంది భారత జట్టు...

410

‘ఫాస్ట్ బౌలింగ్‌ యూనిట్‌పై రవి భాయ్ స్పెషల్ ఫోకస్ పెట్టాడు. విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి ఇద్దరూ కూడా విదేశాల్లో 20 వికెట్లు తీస్తే, టెస్టుల్లోఈజీగా గెలవవచ్చని నమ్మారు. అందుకే ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు..

510
Ishant Sharma

రవిశాస్త్రి విషయంలో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఓటమి తర్వాత కూడా చాలా పాజిటివ్‌గా ఉంటాడు. ప్రతీ ప్లేయర్‌ బలం ఏంటో ఆయనకి తెలుసు. దానికి మించి ఆ బలాన్ని పూర్తిగా ఎలా బయటికి తీసుకోవడంలో రవి భాయ్ ఎక్స్‌పర్ట్...

610

నేను ఏ మ్యాచ్‌లో అయిన ఫెయిల్ అయితే నాకు కోపం తెప్పించేలా తిట్టేవాడు. ఆ మాటలకు నాకు చిర్రెత్తుకొచ్చింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో 100 శాతం రిజల్ట్ ఇచ్చేవాడిని... కోపం వస్తే నన్ను నేను ఆపుకోలేను. ఆవేశంతో ఊగిపోయేవాడిని. అదే కసిలో నేను నా పూర్తి బలాన్ని వాడి వికెట్లు తీస్తాను. ఆ విషయం రవిభాయ్‌కి బాగా అర్థమైంది...

710

అందుకే మంట పెట్టి, చలి కాచుకుంటాడు. పిచ్చెక్కిపోయేలా చేసి.. కూల్‌గా కూర్చుని మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తాడు. ఒక్కో ప్లేయర్ మనస్థత్వం ఒక్కోలా ఉంటుంది. ఏ ప్లేయర్ ఎలా చెబితే వింటాడో రవిభాయ్‌కి బాగా తెలుసు. అందుకే ఒక్కో ప్లేయర్‌ని ఒక్కోలా ఢీల్ చేస్తారు.

810

కొందరికి నెమ్మదిగా చెబుతాడు. మరికొందరిని తిట్టి చెబుతాడు. మరికొందరిని నువ్వు ఎందుకు పనికిరావని కోపం తెప్పించేలా మాట్లాడి రిజల్ట్ రాబడతాడు. ఎంత ఘోరంగా ఓడినా, ఆ తర్వాతి మ్యాచ్‌లో గెలవాలంటే ఏం చేయాలో రవిశాస్త్రికి బాగా తెలుసు..’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ...

910

టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ విషయంలో కూడా రవిశాస్త్రి ఇలాగే నడుచుకున్నాడు. 2018 సౌతాఫ్రికా టూర్‌లో షమీ తింటున్న ప్లేట్ లాగేసి.. ‘అక్కడ మ్యాచ్ పోయేలా ఉంది. నువ్వు ఇక్కడ మటన్ తింటున్నావా? నీ ఆకలి, ఈ తిండితోనే నిండుతుందా? వికెట్లు తీసేది ఏమైనా ఉందా...’ అంటూ అరిచాడట రవిశాస్త్రి...

1010

ఆ మాటలకు చిర్రెత్తుకొచ్చిన మహ్మద్ షమీ, బ్రేక్ తర్వాత అదిరిపోయే బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 28 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసిన మహ్మద్ షమీ, తనకు కోపం తెప్పించిన రవిశాస్త్రికి థ్యాంక్స్ చెప్పుకున్నాడని రాసుకొచ్చాడు భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్.. 
 

click me!

Recommended Stories