ఛతేశ్వర్ పూజారాపై అసంతృప్తి... ‘నయా వాల్’ స్థానంలో ఆ క్లాస్ ప్లేయర్‌కి ఛాన్స్..

First Published Jun 26, 2021, 9:59 AM IST

ఛతేశ్వర్ పూజారా... టెస్టుల్లో టీమిండియాకి బ్యాటింగ్‌లో ‘వెన్నుముక’లాంటి ప్లేయర్. రాహుల్ ద్రావిడ్ వారసుడిగా, టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూజారా, పదేళ్లుగా టీమిండియాలో కీలక సభ్యుడిగా మారాడు.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఛతేశ్వర్ పూజారా పర్ఫామెన్స్ ఏ మాత్రం ఆశాజనకంగా అనిపించలేదు. ఓ ఎండ్‌లో వికెట్లు పడకుండా అడ్డుగోడలా నిల్చునే పూజారా, తొలి ఇన్నింగ్స్‌లో 8, రెండో ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
undefined
ఎలాంటి పిచ్‌లో అయినా వీరోచిత పోరాటం చేస్తూ, భారత జట్టుకి విజయాలు అందించే పూజారా... రెండున్నర ఏళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు...
undefined
భారత సారథి విరాట్ కోహ్లీ 2019 నవంబర్‌లో చివరిగా సెంచరీ చేస్తే, ఛతేశ్వర్ పూజారా 2019 జనవరిలో చివరిగా సెంచరీ మార్కు అందుకున్నాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీ మార్క్ అందుకుంటున్నా, సెంచరీ మాత్రం చేయలేకపోయాడు.
undefined
డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన విరాట్ కోహ్లీ... ‘వికెట్ పడకుండా కాపాడుకోవాలనే ఆలోచనతో బ్యాటింగ్ చేస్తే, పరుగులు చేయలేం. పరుగులు చేయకుండా క్రీజులో ఎంతసేపు ఉంటే మాత్రం ఏం లాభం’ అంటూ కామెంట్ చేశాడు.
undefined
ప్రత్యేక్షంగా పేరు చెప్పకపోయినా, విరాట్ కోహ్లీ మాటలు పూజారా గురించేనని క్రికెట్ ఫ్యాన్స్‌కి కూడా ఈజీగా అర్థమైపోతుంది...
undefined
ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే... ఇలా మిడిల్ ఆర్డర్‌లో ప్లేయర్లు ఫిక్స్ అయిపోవడంతో కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ లాంటి యంగ్ ప్లేయర్లు రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది.
undefined
దీంతో ఇంగ్లాండ్ సిరీస్‌లో ప్రయోగాలు చేయాలని భావిస్తోందట టీమిండియా. పూజారా బ్యాటింగ్‌కి వచ్చే మూడో స్థానంలో విరాట్ కోహ్లీని బ్యాటింగ్‌కి పంపి... నాలుగో స్థానంలో కెఎల్ రాహుల్‌కి ఛాన్స్ ఇవ్వాలని ఆలోచనలు చేస్తోందట.
undefined
కెఎల్ రాహుల్‌తో పాటు మయాంక్ అగర్వాల్, హనుమ విహారి సేవలను కూడా వినియోగించుకోవాలని భావిస్తోందట టీమ్ మేనేజ్‌మెంట్.
undefined
ఇదే నిజమైతే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2019-21లో టీమిండియా ఆడిన ప్రతీ మ్యాచ్‌లో పాల్గొన్న ఇద్దరు ప్లేయర్లలో ఒకడైన ఛతేశ్వర్ పూజారా... ఈ సీజన్‌లో ఆ రికార్డుకి దూరం కావాల్సి ఉంటుంది...
undefined
ఫైనల్‌లో ఛతేశ్వర్ పూజారా కంటే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా... ఏ మాత్రం అనుభవం లేని యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఎక్కువ పరుగులు చేయడంపై టీమ్ మేనేజ్‌మెంట్ సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం.
undefined
అయితే గబ్బా టెస్టుతో అసామాన్యమైన పోరాటం చూపించి, టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన అజింకా రహానే, 2014 ఇంగ్లాండ్ టూర్‌లో, 2018 పర్యటనలో అద్భుతంగా రాణించాడు.
undefined
టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు కీలకంగా మారే ఛతేశ్వర్ పూజారాను ఒక్క మ్యాచ్ పర్ఫామెన్స్‌తో పక్కనబెట్టాలని చూడడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు అభిమానులు.
undefined
click me!