సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకుని న్యూజిలాండ్ బోర్డుకు షాకచ్చిన బౌల్ట్.. కారణం అదేనా..?

Published : Aug 10, 2022, 11:54 AM IST

Trent Boult: న్యూజిలాండ్ వెటరన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఆ దేశ క్రికెట్ బోర్డుకు ఊహించని షాకిచ్చాడు. అతడు సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకున్నాడు. 

PREV
16
సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకుని న్యూజిలాండ్ బోర్డుకు షాకచ్చిన బౌల్ట్.. కారణం అదేనా..?

ప్రపంచ క్రికెట్ లో ప్రస్తుతం అగ్రశ్రేణి బౌలర్ గా కొనసాగుతున్న న్యూజిలాండ్ స్టార్ పేసర్  ట్రెంట్ బౌల్ట్.. తన దేశ క్రికెట్ బోర్డు (న్యూజిలాండ్ క్రికెట్ - ఎన్‌జెడ్‌సీ)కు షాకిచ్చాడు. తనను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి విముక్తుడిని చేయాలని అతడు పెట్టుకున్న అభ్యర్థనలకు ఎన్‌జెడ్‌సీ సానుకూలంగా స్పందించింది. అతడిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది. 

26

తన కుటుంబంతో గడిపేందుకు గాను  బౌల్ట్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ఎన్‌జెడ్‌సీ తెలిపింది. తనను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించాలని బౌల్ట్ గత కొన్ని రోజులుగా అభ్యర్థనలు పెట్టుకుంటుండగా తాజాగా ఎన్‌జెడ్‌సీ దానికి అంగీకారం తెలిపింది.  

36

న్యూజిలాండ్ లో సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లు అక్కడ జట్టు ఎంపికలో ఫస్ట్ ఛాయిస్ క్రికెటర్లుగా పరిగణించబడతారు. సెంట్రల్ కాంట్రాక్టు ఉండి వాళ్లు అందుబాటులో లేకుంటేనే జట్టు మిగతా ఆటగాళ్ల వైపు చూస్తుంది.  కానీ బౌల్ట్ తాజాగా దానినే వదులుకోవడం గమనార్హం.

46

అయితే కుటుంబం, వ్యక్తిగత కారణాలని చెబుతున్నా బౌల్ట్ మదిలో మాత్రం వేరే ఉందని న్యూజిలాండ్ క్రికెట్ లో చర్చ సాగుతున్నది. అతడి చూపు దేశం పై కాకుండా దేశవాళీ లీగ్ ల మీద పడిందని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ తో పాలు పలు లీగ్ లలో భాగమవుతున్న బౌల్ట్.. ఇక అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్పి ఫ్రాంచైజీ లీగ్ లలో ఆడదామని నిశ్చయించుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

56

ఐపీఎల్ లో బౌల్ట్ రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు.  ఈ జట్టు తాజాగా దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది నుంచి జరుగబోయే టీ20లీగ్ లో అక్కడ ఓ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. దీంతో పాటు యూఏఈ టీ20 లీగ్ లో కూడా  ఆ జట్టుకు పెట్టుబడులున్నాయి. ఈ నేపథ్యంలో బౌల్ట్ నిర్ణయం వెనుక రాజస్తాన్ రాయల్స్ కూడా ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.  అయితే దీనిమీద బౌల్ట్ గానీ ఇటు రాజస్తాన్ యాజమాన్యం గానీ  స్పందించలేదు.. 

66

న్యూజిలాండ్ తరఫున 78 టెస్టులు, 93 వన్డేలు, 44 టీ20లు ఆడాడు బౌల్ట్. టెస్టులలో 317 వికెట్లు తీసిన బౌల్ట్.. వన్డేలలో 169, టీ20లలో 62 వికెట్లు పడగొట్టాడు. 33 ఏండ్ల బౌల్ట్..  2011 నుంచి  న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. 

click me!

Recommended Stories