India Tour Of Zimbabwe: వెస్టిండీస్ పర్యటనలో వన్డేలలో టీమిండియాకు సారథిగా వ్యవహరించిన శిఖర్ ధావన్ ఆ తర్వాత మరికొద్దిరోజుల్లో జింబాబ్వే పర్యటనలో కూడా కెప్టెన్ గా ఉండనున్నాడు.
టీమిండియాకు గతంలో అన్ని ఫార్మాట్లలోనూ ఆడిన ఓపెనర్ శిఖర్ ధావన్ గత కొద్దికాలంగా కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. ఐపీఎల్ లో టీ20 మ్యాచులు ఆడుతూ అతడు రాణిస్తున్నా జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. ఇక టెస్టులలో అతడి పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు.
27
ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ద్వారా జట్టులోకి పునరాగామనం చేసిన ధావన్.. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కు సారథిగా వ్యవహరించాడు. కానీ తర్వాత జరిగిన టీ20 సిరీస్ లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. మళ్లీ ఈనెల 18 నుంచి జింబాబ్వే పర్యటనలో టీమిండియాకు మళ్లీ సారథిగా ఉండనున్నాడు. అయితే వన్డేలకు మాత్రమే అతడిని తీసుకుంటుండటం.. మిగిలిన ఫార్మాట్లకు పక్కనబెడుతుండటంపై తాజాగా అతడు స్పందించాడు.
37
ధావన్ మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే నాక్కూడా ఆ కారణం (టీ20లలో ఎందుకు ఆడటం లేదో) తెలియదు. అయితే నేను ఆ విషయంలో మరీ ఆలోచించి బుర్ర పాడు చేసుకోవాలని లేను. నాకు ఏ ఫార్మాట్ లో ఆడే అవకాశం వచ్చినా ఆ మ్యాచ్ లో వంద శాతం రాణించడమే ముఖ్యం. ఫార్మాట్ తో నాకు సంబంధం లేదు.
47
నేను టీమిండియా తరఫున టీ20 ఆడక చాలా రోజులైంది. అలా అని నేనేమీ బాధపడుతూ కూర్చోను. ఐపీఎల్, దేశవాళీ, జాతీయ జట్టు.. నాకు ఏ అవకాశం వచ్చినా అక్కడ ఆడతా..’ అని తెలిపాడు.
57
ఇక వన్డే క్రికెట్ అంతరించిపోతుందన్న వాదనలపై ధావన్ స్పందించాడు. అటువంటిదేమీ లేదని.. తనకు మాత్రం వన్డే క్రికెట్ ఆడటం ఇష్టమని వ్యాఖ్యానించాడు. వన్డే క్రికెట్ ఆడటం ఒక కళ అని అన్నాడు.
67
‘వన్డే క్రికెట్ ఆటం నాకు చాలా ఇష్టం. ఈ ఫార్మాట్ ఆడటం ఒక కళ. టీ20లు, టెస్టులు ఎంత క్రేజ్ పొందుతున్నా వన్డే క్రికెట్ కు ఉండే క్రేజే వేరు. మిగిలిన రెండు ఫార్మాట్ల మాదిరే 50 ఓవర్ల ఆట కూడా మనుగడలో ఉంటుంది..’ అని తెలిపాడు.
77
భారత జట్టుకు ఆడుతున్నన్ని రోజులు తాను జట్టుకు ఆస్తిగా ఉంటానే తప్ప భారంగా మారబోనని ధావన్ చెప్పాడు. తన ప్రదర్శన తన ఆట మీద ప్రభావం చూపుతుందని, బేసిక్స్, టెక్నిక్ విషయంలో తాను స్ట్రాంగ్ గా ఉన్నానని చెప్పుకొచ్చాడు.