న్యూజిలాండ్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ పెళ్లి చేసుకున్నాడు. 33 ఏళ్ల వయసులో తన ఫియాన్సీ బైరా ఫహీని క్రైస్తవ సంప్రదాయంలో వివాహం చేసుకున్నాడు సౌథీ. అయితే ఈ ఇద్దరికీ ఇప్పటికే ఇద్దరు కూతుర్లు కూడా ఉండడం విశేషం...
బైరా ఫహీతో ఎన్నో ఏళ్లుగా డేటింగ్ చేస్తున్న టిమ్ సౌథీ, 2019లో ఆమెతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఎంగేజ్‌మెంట్ తర్వాత మూడేళ్లకు ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు...
29
ఇప్పటికే టిమ్ సౌథీ, బౌరా ఫహీలకు ఇండీ మే సౌథీ, స్లోఆనీ అవ సౌథీ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోను పోస్టు చేసిన సౌథీ, ‘ఫరెవర్’ అంటూ కాప్షన్ ఇచ్చాడు...
39
ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ 2006తో పాటు కేన్ విలియంసన్ కెప్టెన్సీలో 2008 అండర్ 19 వరల్డ్ కప్ ఆడిన న్యూజిలాండ్ జట్టులోనూ టిమ్ సౌథీ సభ్యుడిగా ఉన్నాడు...
49
2008 అండర్ 19 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన టిమ్ సౌథీ, న్యూజిలాండ్ తరుపున 85 టెస్టు మ్యాచులు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు...
59
బ్యాటింగ్‌లోనూ 5 హాఫ్ సెంచరీలతో 1769 పరుగులు చేసిన టిమ్ సౌథీ, ఇప్పటికే టెస్టుల్లో 75 సిక్సర్లు బాది... టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లలో ఒకడిగా ఉన్నాడు...
69
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కేకేఆర్ జట్ల తరుపున ఆడాడు టిమ్ సౌథీ...