ఒకప్పుడు పర్పుల్ క్యాప్ విన్నర్‌, ఇప్పుడేమో... గుజరాత్ టైటాన్స్‌కి నెట్ బౌలర్‌గా మోహిత్ శర్మ...

Published : Mar 20, 2022, 01:54 PM IST

ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియాలోకి అలా వచ్చి, కొన్నాళ్లు ఆడి... మాయమైన వారిలో పేసర్ మోహిత్ శర్మ కూడా ఒకడు. టీమిండియా తరుపున 26 మ్యాచులు ఆడిన మోహిత్ శర్మ, ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌కి నెట్‌ బౌలర్‌గా మారడం అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది..

PREV
19
ఒకప్పుడు పర్పుల్ క్యాప్ విన్నర్‌, ఇప్పుడేమో... గుజరాత్ టైటాన్స్‌కి నెట్ బౌలర్‌గా మోహిత్ శర్మ...

2013 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన మోహిత్ శర్మ, ఆ సీజన్‌లో 15 మ్యాచులు ఆడి 20 వికెట్లు తీసి ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు...

29

ఆ తర్వాతి సీజన్‌ 2014లో 16 మ్యాచులు ఆడిన మోహిత్ శర్మ 23 వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన మోహిత్ శర్మ, పర్పుల్ క్యాప్ విన్నర్‌గా నిలిచాడు...
 

39

2015 సీజన్‌లో 16 మ్యాచులు ఆడిన మోహిత్ శర్మ, 14 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. దీంతో 2016 సీజన్‌కి ముందు చెన్నై సూపర్ కింగ్స్, మోహిత్ శర్మను వేలానికి వదిలేసింది...

49

2016 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడిన మోహిత్ శర్మ, 14 మ్యాచుల్లో 13 వికెట్లు తీశాడు. ఆ తర్వాతి ఏడాది కూడా సరిగ్గా 14 మ్యాచుల్లో 13 వికెట్లు తీసిన మోహిత్, ఎకానమీ మెయింటైన్ చేయలేకపోయాడు...

59

2018 ఐపీఎల్ సీజన్‌లో మోహిత్ శర్మ 9 మ్యాచుల్లో 7 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. వికెట్లు తీయలేకపోవడమే కాకుండా భారీగా పరుగులు ఇస్తుండడంతో పంజాబ్ కింగ్స్ జట్టు కూడా మోహిత్ శర్మను వేలానికి విడుదల చేసింది..

69

2019 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి మోహిత్ శర్మను కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్‌లో ఒకే మ్యాచ్ ఆడిన మోహిత్ శర్మ, 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఒకే మ్యాచ్ ఆడి ఒకే వికెట్ తీయగలిగాడు...

79

2015 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో చోటు దక్కించుకున్న మోహిత్ శర్మ, 8 మ్యాచుల్లో 13 వికెట్లు తీశాడు. టీమిండియా తరుపున 26 వన్డేలు, 4 టీ20 మ్యాచులు ఆడిన మోహిత్ శర్మ, ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టుకి నెట్ బౌలర్‌గా వ్యవహరిస్తుండడం విశేషం...
 

89

నిలకడైన ప్రదర్శన ఇవ్వలేక, ఫామ్‌ను, పేస్‌ను కోల్పోయిన మోహిత్ శర్మ జట్టుకి దూరమవ్వడమే కాకుండా ఫ్రాంఛైజీలను ఆకట్టుకోలేక... ఐపీఎల్‌కి దూరమయ్యాడు...

99

మోహిత్ శర్మతో పాటు ఐపీఎల్ 2016 సీజన్‌‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన బరిందర్ స్రాన్ కూడా గుజరాత్ టైటాన్స్‌కి నెట్ బౌలర్‌గా మారడం విశేషం. 

click me!

Recommended Stories