సీఎస్‌కే ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీకి వీసా కష్టాలు... కేకేఆర్‌తో మ్యాచ్‌కి దూరమయ్యే ఛాన్స్...

Published : Mar 20, 2022, 03:14 PM IST

ఐపీఎల్ 2022 మెగా సీజన్‌కి సైరన్ మోగింది. ఇప్పటికే దేశ, విదేశ ప్లేయర్లు అందరూ ఫ్రాంఛైజీలు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో చేరి, ప్రాక్టీస్ మొదలెట్టేశారు. అయితే ఈసారి ఐపీఎల్ ఆరంభ మ్యాచులకు స్టార్ అట్రాక్షన్ మిస్ కానుంది...

PREV
110
సీఎస్‌కే ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీకి వీసా కష్టాలు... కేకేఆర్‌తో మ్యాచ్‌కి దూరమయ్యే ఛాన్స్...

ఐపీఎల్ 2022 సీజన్, సాధారణ షెడ్యూల్ కంటే వారం ముందుగా మొదలు అవుతుండడంతో అంతర్జాతీయ మ్యాచుల్లో బిజీగా ఉన్న ఆసీస్, విండీస్, బంగ్లా క్రికెటర్లు ఆలస్యంగా ఇక్కడికి రానున్నారు...

210

అలాగే ఇంగ్లాండ్‌ క్రికెటర్లు చాలామంది వివిధ కారణాలతో ఐపీఎల్‌కి దూరంగా ఉన్నారు. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, జో రూట్, సామ్ కుర్రాన్ లాంటి ప్లేయర్లు మెగా వేలానికి రిజిస్టర్ కూడా చేయించుకోలేదు...

310

మెగా వేలంలో బేస్ ప్రైజ్‌కి అమ్ముడుపోయిన అలెక్స్ హేల్స్, జాసన్ రాయ్... బయో బబుల్ భయంతో ఐపీఎల్ 2022కి దూరం కాగా విండీస్‌తో సిరీస్‌లో గాయపడిన మార్క్ వుడ్ కూడా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు...

410

చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ కూడా ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచులకు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. దీనికి కారణం మొయిన్ ఆలీకి వీసా క్లియరెన్స్ రాకపోవడమే.

510

‘దాదాపు 20 రోజుల క్రితం ఫిబ్రవరి 28న మొయిన్ ఆలీ, భారత వీసాకి అప్లై చేశాడు. అయితే ఇప్పటికి మొయిన్ ఆలీ వీసాపై క్లియరెన్స్ రాలేదు. భారత్‌తో సిరీస్‌ల కోసం, ఐపీఎల్ కోసం మొయిన్ ఆలీ చాలాసార్లు ఇండియాకి వచ్చాడు...
 

610

అయినా మొయిన్ ఆలీకి ట్రావెల్ పేపర్స్ అందలేదు. వీసా క్లియరెన్స్ రాగానే వీలైనంత త్వరగా ఇండియాకి వచ్చేస్తానని ఆలీ చెప్పాడు.. 

710

ఈ విషయంలో అవసరమైన సాయం చేసేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. సోమవారంలోగా మొయిన్ ఆలీ, ఇండియాకి చేరుకుంటాడని ఆశిస్తున్నాం...’ అంటూ తెలిపాడు సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్...

810

ఇండియాకి చేరిన తర్వాత జట్టుతో చేరడానికి ముందు వారం రోజుల పాటు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. దీంతో మార్చి 26న కేకేఆర్‌తో జరిగే ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్‌తో మొయిన్ ఆలీ అందుబాటులో ఉండడం అనుమానమే...

910

ఐపీఎల్ 2021 వేలంలో రూ.7 కోట్లకు మొయిన్ ఆలీని కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అటు బ్యాటుతో, ఇటు బాల్‌తో అదరగొట్టిన మొయిన్ ఆలీని, రూ.8 కోట్లకు ఐపీఎల్ 2022 సీజన్ కోసం రిటైన్ చేసుకుంది సీఎస్‌కే...

1010

ఇప్పటికే దీపక్ చాహార్ గాయం కారణంగా తప్పుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఊహించని షాక్ తగిలింది. చాహార్ ఎప్పటికి కోలుకుంటాడు? ఏ సమయానికి అందుబాటులోకి వస్తాడనే విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు...
 

Read more Photos on
click me!

Recommended Stories