గెలిచారు, వస్తున్నారు... ఐపీఎల్ 2021లో మిగిలిన మ్యాచులకు కివీస్ ప్లేయర్లు...

First Published Jun 25, 2021, 9:51 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు న్యూజిలాండ్ ప్లేయర్లు అందుబాటులో ఉండబోరని చాలారోజుల కిందటే తేల్చేసింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ విజయంతో కివీస్ బోర్డు ఆలోచన మారింది.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాని ఓడించి, 21 ఏళ్ల తర్వాత మొట్టమొదటి ఐసీసీ టోర్నీ అందుకుంది న్యూజిలాండ్...
undefined
2015 వన్డే వరల్డ్‌కప్, 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీ ఫైనల్ మ్యాచుల్లో ఓడిన న్యూజిలాండ్‌కి చాలా రోజుల తర్వాత దక్కిన ఊరట విజయం ఇది...
undefined
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిష్ ఫైనల్‌లో దక్కిన విజయంతో ఇప్పుడు న్యూజిలాండ్, టీ20 వరల్డ్‌కప్‌పై ఫోకస్ పెట్టింది...
undefined
2021 టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు జరిగే ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు అందుబాటులో ఉండేలా న్యూజిలాండ్ ప్లేయర్ల షెడ్యూల్‌ను ఫిక్స్ చేసిందట కివీస్ బోర్డు...
undefined
ముందు పంపమని తేల్చినా, ఇప్పుడు ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు న్యూజిలాండ్ ప్లేయర్లను పంపేందుకు కివీస్ క్రికెట్ బోర్డు అంగీకరించిందని సమాచారం...
undefined
దీంతో 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియంసన్, ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌తో సహా ఆర్‌సీబీ ప్లేయర్ కేల్ జెమ్మీసన్, జేమ్స్ నీశమ్, మిచెల్ సాంట్నర్ అందుబాటులో ఉండబోతున్నారు.
undefined
న్యూజిలాండ్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ ప్లేయర్లు ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు అందుబాటులో ఉండడం ఖరారైంది...
undefined
ఇంగ్లాండ్‌తో పాటు ఆఫ్ఘాన్ ప్లేయర్ల రాకపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. యాషెస్ సిరీస్‌పై పూర్తి ఫోకస్ పెట్టిన ఇంగ్లాండ్ జట్టు, ప్లేయర్లను పంపేందుకు వీలుకాదని తేల్చేయగా... ఆఫ్ఘాన్ ప్లేయర్లు ఐపీఎల్ 2021 సీజన్ సాగే సమయంలో ఆసీస్‌తో ట్రై సిరీస్ ఆడబోతున్నారు.
undefined
click me!