డబ్ల్యూటీసీ విజేత న్యూజిలాండ్... ఫైనల్‌లో టీమిండియా ఓటమి... 21 ఏళ్ల తర్వాత...

Published : Jun 23, 2021, 11:07 PM IST

ఐసీసీ ప్రవేశపెట్టిన మొట్టమొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీ న్యూజిలాండ్‌కే వరించింది. టేబుల్ టాపర్‌గా ఫైనల్‌కి దూసుకొచ్చిన టీమిండియా, ఆఖరి ఆటలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో విఫలమై భారీ మూల్యం చెల్లించుకుంది...

PREV
110
డబ్ల్యూటీసీ విజేత న్యూజిలాండ్... ఫైనల్‌లో టీమిండియా ఓటమి... 21 ఏళ్ల తర్వాత...

రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 170 పరుగులకే ఆలౌట్ కావడంతో 139 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్... కెప్టెన్ కేన్ విలియంసన్, సీనియర్ బ్యాట్స్‌మెన్ రాస్‌ టేలర్ కీలక భాగస్వామ్యం కారణంగా ఆడుతూ పాడుతూ టార్గెట్‌ను చేధించింది.

210

తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే కాస్త ముందుగానే బంతిని అందుకున్న రవిచంద్రన్ అశ్విన్... ఓపెనర్లు టామ్ లాథమ్, డివాన్ కాన్వే వికెట్లు తీసి భారత శిబిరంలో ఆశలు రేపాడు...

310

44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. అయితే కేన్ విలియంసన్, రాస్ టేలర్ మరో అవకాశం ఇవ్వకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు...

410

బుమ్రా బౌలింగ్‌లో రాస్ టేలర్ ఇచ్చిన క్యాచ్‌ను ఛతేశ్వర్ పూజారా వదిలేయడం కూడా న్యూజిలాండ్‌కి కలిసి వచ్చింది...

510

చివరిసారిగా 2000లో టీమిండియాతో జరిగిన ఫైనల్‌లో గెలిచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకున్న న్యూజిలాండ్‌‌కి ఇది రెండో ఐసీసీ టైటిల్...

610

2015 వన్డే వరల్డ్‌కప్, 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచుల్లో ఓడిన న్యూజిలాండ్ జట్టు, ఎట్టకేలకు భారత జట్టునే ఓడించి... రెండో ఐసీసీ టైటిల్ కైవసం చేసుకోగలిగింది...

710

చివరిసారిగా 2007 వన్డే వరల్డ్‌కప్‌ గ్రూప్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన టీమిండియా, ఆ తర్వాత ఏ ఐసీసీ టోర్నీలోనూ న్యూజిలాండ్‌పై విజయం సాధించలేకపోయింది.

810

2019 వన్డే వరల్డ్‌కప్ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన విరాట్ సేన, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో న్యూజిలాండ్‌పై మాత్రమే టెస్టు సిరీస్ కోల్పోయింది. ఫైనల్‌లోనూ ఓటమి పాలైంది...

910

ఐదురోజుల పాటు ఆటకు అంతరాయం కలిగించిన వరుణుడు కానీ, వాతావరణం కానీ... టీమిండియా ఓటమిని ఆపలేకపోయాయి. రిజర్వు డే రోజున ఏకంగా ఓవర్ల పాటు ఆట నిరంతరాయంగా సాగడం విశేషం...

1010

కేన్ విలియంసన్ 52 పరుగులు చేయగా, రాస్ టేలర్ 47 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ 96 పరుగులు జోడించి. న్యూజిలాండ్‌కి 8 వికెట్ల తేడాతో అఖండ విజయం అందించారు.

click me!

Recommended Stories