2 కి.మీ.ల ఫిట్‌నెస్ టెస్టు... సంజూ శాంసన్‌తో సహా ఆరుగురు క్రికెటర్లు ఫెయిల్...

Published : Feb 12, 2021, 12:04 PM IST

జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే తప్పనిసరి చేసిన 2 కి.మీ.ల ఫిట్‌నెస్ టెస్టును పూర్తి చేయడంలో ఆరుగురు క్రికెటర్లు ఫెయిల్ అయ్యారు. బీసీసీఐ అమలులోకి వచ్చిన ఈ కొత్త ఫిట్‌నెస్ టెస్టు ప్రకారం టీమిండియా చోటు దక్కించుకునే పేసర్లు 8 నిమిషాల 15 సెకన్లలో 2 కి.మీ.ల టార్గెట్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. 

PREV
15
2 కి.మీ.ల ఫిట్‌నెస్ టెస్టు... సంజూ శాంసన్‌తో సహా ఆరుగురు క్రికెటర్లు ఫెయిల్...

ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టును గాయాలు విపరీతంగా వేధించాయి. మొదటి టెస్టు నుంచి ఆఖరి టెస్టు వరకూ దాదాపు 8 మంది క్రికెటర్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. దీంతో క్రికెటర్ల ఫిట్‌నెస్‌పై మరింత ఎక్కువ ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకుంది బీసీసీఐ. 

25

ఇందులో భాగంగా భారత జట్టులో చోటు దక్కించుకోవాలనుకునే పేసర్లు 8 నిమిషాల 15 సెకన్లలో... స్పిన్నర్లు, వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ అయితే 8 నిమిషాల 30 సెకన్లలో 2 కిలో మీటర్ల దూరాన్ని పరుగెత్తాల్సి ఉంటుంది... ఈ టెస్టు పాస్ అయితేనే టీమిండియాకు ఆడే అవకాశం దక్కుతుంది.

35

బీసీసీఐ సూచించిన ఈ 2 కిలో మీటర్ల కొత్త ఫిట్‌నెస్ టెస్టుకు భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించారు. దీంతో ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే టీమ్‌ను ఎంపిక చేసేందుకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్లేయర్లకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తోంది బీసీసీఐ...

45

టీ20 సిరీస్ కోసం 20 మంది క్రికెటర్లకు జాతీయ క్రికెట్ అకాడమీలో ఈ ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించగా ఆరుగురు ప్లేయర్లు ఇందులో ఫెయిల్ అయ్యారు. భారత యంగ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌తో పాటు రాహుల్ తెవాటియా, నితీశ్ రాణా, సిద్ధార్థ్ కౌల్, జయ్‌దేవ్ ఉనద్కడ్ ఈ టెస్టులో ఫెయిల్ అయ్యారు.

55

ఈ ఏడాది చివర్లో టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో అందుకోసం యువ జట్టును సిద్ధం చేయాలని ప్రణాళికలు రచిస్తోంది బీసీసీఐ. ఇందుకోసం ఐపీఎల్‌లో రాణించిన యంగ్ ప్లేయర్లను టీమిండియా తరుపున టీ20ల్లో ఆడించాలని భావిస్తున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్ నుంచి కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటోంది బీసీసీఐ.

click me!

Recommended Stories