శ్రీశాంత్ కు షాక్: IPL 2021 మినీ వేలంలో 292 మంది క్రికెటర్లు

First Published Feb 12, 2021, 11:35 AM IST

ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలంలో 292 మంది క్రికెటర్లు పాల్గొనబోతున్నారు. వేలం కోసం మొత్తంగా 1114 మంది క్రికెటర్లు రిజిస్టర్ చేయించుకున్నా, వారిలో 822 మంది క్రికెటర్లను వేలం నుంచి తొలగించి, షార్ట్ లిస్ట్ తయారుచేసింది ఐపీఎల్ యాజమాన్యం. ఏడేళ్ల బ్యాన్ తర్వాత రీఎంట్రీ ఇవ్వాలనుకున్న శ్రీశాంత్‌ కూడా వేలం నుంచి తొలగించబడ్డాడు.

రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ కలిగిన ప్లేయర్ల లిస్టులో భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్ ఉన్నారు. బీసీసీఐ ప్రకటించిన అప్‌గ్రేటెడ్ లిస్టులో ఈ ఇద్దరూ మాత్రమే అత్యధిక బేస్ ప్రైజ్ కలిగిన భారత క్రికెటర్లు.
undefined
వీరితో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, షకీల్ అల్ హసన్, మొయిన్ ఆలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్, మార్క్ వుడ్ రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ కలిగిన లిస్టులో చోటు దక్కించుకున్నారు...
undefined
భారత టెస్టు ప్లేయర్ హనుమ విహారి, ఉమేశ్ యాదవ్‌లతో పాటు 12 మంది క్రికెటర్లు కోటిన్నర బేస్ ప్రైజ్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. మరో 11 మందికి కనీస ధర కోటి రూపాయలుగా ఉంది.
undefined
షార్ట్ లిస్టు చేసిన తర్వాత వేలంలో ఉన్న 292 మంది క్రికెటర్లలో 164 మంది భారత ప్లేయర్లు కాగా, 125 మంది విదేశీ క్రికెటర్లు, ముగ్గురు అసోసియేసియేట్ దేశాల క్రికెటర్లు ఉన్నారు.
undefined
ఏడేళ్ల నిషేధం తర్వాత రీఎంట్రీ ఇచ్చి సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో పాల్గొన్న భారత క్రికెటర్ శ్రీశాంత్ కూడా తొలగించబడిన క్రికెటర్ల జాబితాలో ఉన్నాడు. ఐపీఎల్ వేలంలో తనను తొలగించడంపై అసంతృప్తి చెందానని చెప్పిన శ్రీశాంత్, నిరుత్సాహపడకుండా మరింత మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తానని చెప్పాడు శ్రీశాంత్.
undefined
సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఐపీఎల్ 2021 మినీ వేలంలో పాల్గొనబోతున్నాడు. అతని కనీస ధర రూ.20 లక్షలు. వీరితో పాటు టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా, మార్నస్ లబుషేన్ కూడా మినీ వేలంలో పాల్గొనబోతున్నారు. లబుషేన్ బేస్ ప్రైజ్ కోటి రూపాయలు కాగా పూజారా ధర రూ.50 లక్షలు.
undefined
ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొట్టున్న జట్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పర్సులో రూ.53.20 కోట్లు ఉండగా, అత్యల్పంగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్సులో రూ.10.75 కోట్లు ఉన్నాయి. ఆర్‌సీబీ ఖాతాలో రూ.35.40 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో రూ.37.85 కోట్లు ఉన్నాయి.
undefined
చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న జరిగే ఐపీఎల్ 2021 మినీ వేలం జరగనుంది.10 మంది ప్లేయర్లను విడుదల చేసిన ఆర్‌సీబీలో 11 స్లాట్స్ ఖాళీగా ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టులో కేవలం 3 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐదుగురు విదేశీ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నైలు ఒకే ఒక్క విదేశీ ప్లేయర్‌ను కొనేందుకు అవకాశం ఉంది.
undefined
click me!