విరాట్ కోహ్లీని మాత్రం ఏమీ అనకండి... ఆస్ట్రేలియాకి వార్నింగ్ ఇచ్చిన ఆరోన్ ఫించ్...

First Published Dec 15, 2020, 11:42 AM IST

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ... ఆస్ట్రేలియా సిరీస్‌ను ఘనంగా ఆరంభించకపోయినా టీ20 సిరీస్ గెలిచి, తనపై వచ్చిన విమర్శలకు ధీటుగా సమాధానం ఇచ్చాడు. బ్యాటుతోనే రాణించిన విరాట్ కోహ్లీ... ప్రస్తుతం డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్టు కోసం సన్నద్ధమవుతున్నాడు. ఐపీఎల్‌లో తనకి కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీని సెడ్జింగ్ చేయొద్దని ఆస్ట్రేలియా జట్టు ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చాడు ఆసీస్ వన్డే, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్.

మిగిలిన దేశాల ప్లేయర్లతో పోలిస్తే భారత క్రికెటర్ల స్టైల్ వేరుగా ఉంటుంది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు రెచ్చగొడితే, బ్యాటుతో రెచ్చిపోయి అదిరిపోయే ఆన్సర్ ఇస్తారు ఇండియన్ క్రికెటర్లు...
undefined
యువరాజ్ సింగ్ సిక్సర్ల మోత అయినా, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ వంటి బ్యాట్స్‌మెన్ బౌండరీల వర్షం కురిపించినా వాటి వెనకాల వారిని రెచ్చగొడుతూ సెడ్జింగ్‌కి పాల్పడిన ఓ ప్లేయర్ కచ్ఛితంగా ఉంటాడు.
undefined
భారత సారథి విరాట్ కోహ్లీ కూడా ఈ కోవకు చెందినవాడే. తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎవ్వరైనా నోటికి పనిచెబితే, తన బ్యాటుకి మరింత పని చెబుతాడు విరాట్ కోహ్లీ...
undefined
అందుకే టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చాడు ఆరోన్ ఫించ్.. సహజంగానే ఆస్ట్రేలియన్లకు కాస్త నోటి దురద ఎక్కువనే విషయం తెలిసిందే...
undefined
‘విరాట్ కోహ్లీ ఓ స్పెషల్ బ్యాట్స్‌మెన్. అతని ఏకాగ్రతను దెబ్బతీయాలని రెచ్చగొడితే ఆస్ట్రేలియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది...
undefined
విరాట్‌ను ఎవ్వరైనా రెచ్చగొడితే అతను మరింత డేంజరిస్ బ్యాట్స్‌మెన్‌గా మారిపోతాడు... ప్రత్యర్థులు ఎవ్వరు అనేది కూడా చూడకుండా నిర్ధాక్షిణ్యంగా చెలరేగిపోతాడు..
undefined
కోహ్లీతో తలబడేటప్పుడు ఆటగాళ్లు చాలా జాగ్రత్తగా వ్యవహారించాలి. అతనితో కొంత జాగ్రత్తగా ఉండాలి...
undefined
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఎన్నో ఏళ్లుగా మాటల యుద్ధం నడుస్తోంది. ఢీ అంటే ఢీ అనే ఆటగాళ్లు ఉన్నప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫైట్స్ చూడడానికి అవకాశం దొరకుతుంది...’ అని చెప్పాడు ఆరోన్ ఫించ్.
undefined
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ప్రాతినిధ్యం వహించిన ఆరోన్ ఫించ్, తన కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిత్వం గురించి కూడా చెప్పుకొచ్చాడు...
undefined
‘విరాట్ మైదానం బయట చాలా కూల్ అండ్ ఫన్నీగా ఉంటాడు. అందరితో నవ్వుతూ మాట్లాడతాడు... మైదానంలో దిగితే మాత్రం సీన్ రివర్స్... అతను ఆటలో చాలా అగ్రెసివ్...
undefined
విరాట్ కోహ్లీ ప్లానింగ్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మొదటిసారి అతని ఆలోచనాధోరణి చూసి ఆశ్చర్యపోయాను.. ప్రతీ ఆటగాడిని అతను ఎంతగానో నమ్ముతాడు...’ అని చెప్పాడు ఆరోన్ ఫించ్.
undefined
click me!