డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన టీమిండియా ఇకనైనా టాపార్డర్ తమ లోపాలను తెలుసుకుంటే మంచిదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మాజీ ఆటగాళ్లు గౌతం గంభీర్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ వంటి వాళ్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
26
తాజాగా ఇంగ్లాండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ ఓ అడుగు ముందుకేసి.. టీమిండియా టాపార్డర్ పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ బ్యాటింగ్ ను చూసి నేర్చుకుంటే మంచిదని హితువు పలికాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓడిపోయిన తర్వాత నాసిర్ ఈ కామెంట్స్ చేశాడు.
36
హుస్సేన్ మాట్లాడుతూ... ‘టీమిండియా ప్రదర్శన నన్ను చాలా నిరుత్సాహానికి గురి చేసింది. నేను చెప్పబోయే విషయం వింటే భారత అభిమానులకు కోపం రావొచ్చు. కానీ ఇది మాత్రం నిజం. టీమిండియా టాపార్డర్ బ్యాటర్లలో చాలా లోపాలున్నాయి. వాళ్లకు విదేశీ పిచ్ లపై పేసర్లను ఎలా ఎదుర్కోవాలో ఇంకా తెలిసిరావడం లేదు.
46
ఈ విషయంలో వాళ్ల పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ ను గానీ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను చూసి గానీ నేర్చుకోవాలి. బౌన్సీ పిచ్ లపై పేసర్లను ఎలా ఆడాలనేదానిపై వాళ్లు ఎలా ఆడుతున్నారో చూడాలి...’ అని నాజర్ స్కై స్పోర్ట్స్ తో అన్నాడు.
56
ఈ మ్యాచ్ లో భారత జట్టు రోహిత్, కోహ్లీల మీద భారీ ఆశలుపెట్టుకున్నా వాళ్లు దానికి అనుగుణంగా రాణించలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లో రోహిత్.. 15 పరుగులే చేయగా కోహ్లీ 14 రన్స్ చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో రోహిత్.. 43 రన్స్ చేయగా కోహ్లీ 49 పరుగులే చేశాడు.
66
కాగా బాబర్ ఇదే ఆస్ట్రేలియాపై గతేడాది లాహోర్ వేదికగా జరిగిన టెస్టులో 190 పరుగులు చేసి అత్యద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్ లో అతడు సుమారు 130 ఓవర్లకు పైగా క్రీజులో ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ లో భాగంగా ఐదో రోజుకు ముందు చాలా మంది పాకిస్తాన్ అభిమానులు.. టీమిండియాకు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు.