ఆస్ట్రేలియాకి అది చేతకాదని తెలిసిపోయింది! కనీసం పరువు కాపాడుకోండి... - ఇయాన్ చాపెల్..

Published : Feb 13, 2023, 12:43 PM IST

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లో టాప్‌లో ఉంది ఆస్ట్రేలియా. స్వదేశంలో వరుసగా సిరీస్‌లు గెలిచి, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి చేరువైంది. అయితే అలాంటి ఆసీస్‌కి నాగ్‌పూర్ టెస్టులో ఊహించని షాక్ తగిలింది. టీమిండియా చేతుల్లో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది ఆస్ట్రేలియా...

PREV
17
ఆస్ట్రేలియాకి అది చేతకాదని తెలిసిపోయింది! కనీసం పరువు కాపాడుకోండి... - ఇయాన్ చాపెల్..
Image credit: PTI

ఆడిలైడ్ టెస్టులో టీమిండియా పరాభవాన్ని గుర్తుకు తెచ్చిన ఆస్ట్రేలియా... రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే చాప చుట్టేసింది. భారత స్పిన్నర్ల మ్యాజిక్ ముందు ఆసీస్ బ్యాటర్లు నిలవలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో రెండున్నర సెషన్లు బ్యాటింగ్ చేసిన ఆసీస్, రెండో ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లలోపే ఆలౌట్ అయిపోయింది...

27

రవీంద్ర జడేజా 7 వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ 8 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరుపున అంతర్జాతీయ టెస్టు ఆరంగ్రేటం చేసిన టాడ్ ముర్ఫీ కూడా 7 వికెట్లు తీసి మంచి ప్రారంభం దక్కించుకున్నాడు...

37
Image credit: PTI

‘నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టు, ఆస్ట్రేలియా బలమేంటో, బలహీనతలు ఏంటో పూర్తిగా బయటపెట్టాయి. స్పిన్ పిచ్‌ల మీద ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయలేదని తేలిపోయింది. ఇక పరువు కాపాడుకోవాలంటే చాలా కృషి చేయాలి...
 

47
Image credit: PTI


సిరీస్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వాలంటే ఇండియాలోని పరిస్థితులకు వీలైనంత త్వరగా అలవాటు పడాలి. ఇలాగే ఆడతాం, ఇంతే వచ్చు అనుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది... 
 

57
Image credit: PTI

పిచ్ గురించి ఇంత చర్చ అనవసరం. ఇదేమీ ఊహించనిది కాదు. భారత పిచ్‌ పరిస్థితులు స్పిన్నర్లకు చక్కగా అనుకూలిస్తాయనేది అందరికీ తెలుసు. అయితే నాగ్‌పూర్ పిచ్ మరీ అంత దారుణంగా ఏమీ లేదు. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ కాస్తో కూస్తో బాగా ఆడారు...

67
Image credit: PTI

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 250 పరుగులు చేసి ఉంటే, పరిస్థితి వేరేలా ఉండేది. ప్లేయర్లు గేమ్ తప్ప మిగిలిన విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్వదేశంలో భారత జట్టు చాలా పటిష్టమైన టీమ్.

77
Image credit: Getty

దాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. స్పిన్ పిచ్‌ తయారుచేశారని వాదించకుండా, మ్యాచ్ ఎలా గెలవాలనేదానిపై ఫోకస్ పెడితే బాగుంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్.. 

click me!

Recommended Stories