నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా, ఆస్ట్రేలియాపై పూర్తి డామినేషన్ చూపించింది. భారీ అంచనాలతో టెస్టు సిరీస్‌ని ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు, భారత స్పిన్నర్ల ధాటికి నిలవలేక ఇన్నింగ్స్ తేడాతో చిత్తుగా ఓడింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లు ఫెయిలైన చోట భారత బ్యాటర్లు అదరగొట్టారు...
కెఎల్ రాహుల్ 20 పరుగులు, విరాట్ కోహ్లీ 12, ఛతేశ్వర్ పూజారా 7, సూర్యకుమార్ యాదవ్ 8, శ్రీకర్ భరత్ 8 పరుగులు చేసి టాపార్డర్‌లో ఫెయిల్ అయినా కెప్టెన్ రోహిత్ శర్మ 120 పరుగులతో అదరగొట్టాడు.
26
Image credit: PTI
168 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. అయితే రవీంద్ర జడేజా 70, అక్షర్ పటేల్ 84 పరుగులు చేసి టీమిండియాకి తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగుల భారీ ఆధిక్యం అందించారు...
36
Mohammed Shami
మహ్మద్ షమీ 47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఇంగ్లాండ్ టూర్‌లో లార్డ్స్ టెస్టులో హాఫ్ సెంచరీ చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన షమీ, బ్యాటుతో మళ్లీ అలాంటి మెరుపులే చూపించాడు...
46
Image credit: PTI
తాజాగా మహ్మద్ షమీని అక్షర్ పటేల్ ఇంటర్వ్యూ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది బీసీసీఐ. ‘అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేయాలని అనుకున్నా. చాలాసేపు బ్యాటింగ్ చేయాలనే ఉద్దేశంతోనే క్రీజులోకి వచ్చా. ఓపిక పట్టాలని అనుకున్నా కానీ అది చేయలేకపోయా..’ అన్నాడు మహ్మద్ షమీ...
56
Ravindra Jadeja and Axar Patel
‘నేను శాంతించు, మెల్లిగా ఆడు.. కాస్త సహనం చూపించు... అని చెప్పగానే నువ్వు ఓ సిక్స్ కొట్టావు. మళ్లీ మెల్లిగా ఆడమని చెప్పిన వెంటనే ఇంకో సిక్సర్ బాదావు... ఎందుకు అలాగా?’ అని అడిగాడు అక్షర్ పటేల్...
66
Axar Patel
దానికి షమీ.. ‘నా ఇగో హర్ట్ అయ్యింది. అందుకే సిక్సర్లు బాదాను...’ అంటూ సమాధానం ఇచ్చాడు మహ్మద్ షమీ. 37 పరుగులు చేసిన మహ్మద్ షమీతో 9వ వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు అక్షర్ పటేల్. షమీ అవుటైన తర్వాత సిరాజ్‌తో కలిసి ఆఖరి వికెట్‌కి 20 పరుగుల భాగస్వామ్యం జోడించిన అక్షర్ పటేల్, 84 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు...