ఇండియా vs ఆస్ట్రేలియా మూడో టెస్టు వేదిక మార్చిన బీసీసీఐ... ధర్మశాల నుంచి ఇండోర్‌కి! కారణం ఇదే...

Published : Feb 13, 2023, 10:27 AM ISTUpdated : Feb 13, 2023, 11:34 AM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొదటి టెస్టు క్రికెట్ ఫ్యాన్స్‌కి పెద్దగా కిక్ ఇవ్వలేకపోయింది. భారత స్పిన్ మ్యాజిక్‌కి ఆస్ట్రేలియా బ్యాటర్లు గజగజా వణకడంతో వార్ వన్‌సైడ్ అయిపోయింది. రెండో టెస్టు ఢిల్లీలో జరగబోతుండగా మూడో టెస్టుకి ధర్మశాల వేదిక నివ్వాల్సింది. అయితే మూడో టెస్టుని ధర్మశాల నుంచి ఇండోర్‌కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

PREV
16
ఇండియా vs ఆస్ట్రేలియా మూడో టెస్టు వేదిక మార్చిన బీసీసీఐ... ధర్మశాల నుంచి ఇండోర్‌కి! కారణం ఇదే...

హిమాచల్‌ప్రదేశ్‌లో ధర్మశాల క్రికెట్ స్టేడియం, ప్రపంచంలోని అత్యంత అందమైన క్రికెట్ గ్రౌండ్స్‌లో ఒకటి. ధర్మశాల స్టేడియం నుంచి హిమాలయాలు కనిపిస్తూ, ప్రేక్షకులకు డబుల్ ఆనందాన్ని కలిగిస్తాయి. ధర్మశాల క్రికెట్ స్టేడియంలో ఇప్పటిదాకా ఒకే ఒక్క టెస్టు జరిగింది...

26

2017 మార్చిలో ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ 111 పరుగులు చేసినా ఆసీస్‌కి విజయాన్ని అందించలేకపోయాడు. నాథన్ లియాన్ ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాడు.   అయితే ప్రస్తుతం శీతాకాలం కురిసిన మంచు కారణంగా ఈ స్టేడియం అవుట్ ఫీల్డ్‌ పూర్తిగా చెడిపోయింది. దీన్ని బాగు చేసేందుకు చాలా సమయం పడుతుందని తేల్చారు నిర్వాహకులు...

36
Image credit: PTI

దీంతో మార్చి 1 నుంచి ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్టుని ఇండోర్‌కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ధర్మశాలలో బౌన్సీ పిచ్, ఆస్ట్రేలియాకి బాగా కలిసి వస్తుందనే ఉద్దేశంతోనే వేదికని ఇండోర్‌కి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు కొందరు అభిమానులు...

46
Image credit: PTI

ఇండోర్ క్రికెట్ స్టేడియంలో ఇప్పటిదాకా రెండు టెస్టులు జరిగాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 321 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో నెగ్గింది.. ఇక్కడ సౌతాఫ్రికాతో ఒక్క టీ20 మ్యాచ్ మినహా అన్ని వన్డేలు, టీ20ల్లో నెగ్గింది టీమిండియా..
 

56
Image credit: PTI

తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న భారత జట్టు, మిగిలిన మూడు టెస్టుల్లోనూ నెగ్గి సిరీస్‌ని వైట్ వాష్ చేయాలని చూస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా, రెండో టెస్టులో నెగ్గి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తోంది.. 

66
Ashwin

రవిచంద్రన్ అశ్విన్‌కి ఇండోర్‌లో మంచి రికార్డు ఉంది. ఇక్కడ 12.5 యావరేజ్‌తో 18 వికెట్లు పడగొట్టాడు అశ్విన్. దీంతో అశ్విన్ కోసమే ధర్మశాల నుంచి ఇండోర్‌కి మూడో టెస్టుని మార్చినట్టు రాసుకొచ్చింది ఆస్ట్రేలియన్ క్రికెట్ బ్రాడ్‌కాస్టర్ ఫ్యాక్స్ క్రికెట్.. 

click me!

Recommended Stories