రిషబ్ పంత్‌కి ఛాన్సే లేదు, విరాట్ కోహ్లీ తర్వాత అతనే టీ20 కెప్టెన్... భారీ ఈవెంట్‌ పెట్టి మరీ...

First Published Oct 20, 2021, 3:11 PM IST

భారత సారథి విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ టోర్నీ తర్వాత భారత జట్టును టీ20 ఫార్మాట్‌లో నడిపించే కెప్టెన్ ఎవరనే విషయంపై క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ...

విరాట్ కోహ్లీ, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం ప్రకటించినప్పుడే, రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు దక్కవచ్చని అభిప్రాయపడ్డారు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్...

ఐపీఎల్ కెరీర్‌లో 9 సీజన్లలోనే ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, టీ20 కెప్టెన్సీకి తగిన వాడని కూడా కామెంట్లు వినిపించాయి. అయితే రోహిత్ శర్మ విషయంలో అతిపెద్ద అడ్డంకిగా మారింది వయసు...

34 ఏళ్ల రోహిత్ శర్మ, ఇంకెంత కాలం క్రికెట్‌లో కొనసాగుతాడో? తెలీదు. కాబట్టి అతనికి కెప్టెన్సీ ఇస్తే, కొద్దిరోజులకే మరో కెప్టెన్‌ని వెతికి పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది... దీంతో ఎవరైనా యువ క్రికెటర్‌కి క్రికెట్ పగ్గాలు దక్కవచ్చని టాక్ వినిపించింది...

ఐపీఎల్ 2020 నుంచి సీజన్‌ నుంచి పంజాబ్ కింగ్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కెఎల్ రాహుల్ పేరు, కెప్టెన్సీ పోటీలో ముందుగా వినిపించింది. అయితే ఐపీఎల్ జట్టును నడిపించడంలో ఫెయిల్ అయిన కెఎల్ రాహుల్‌కి పెద్దగా పాజిటివ్ స్పందన రాలేదు...

అన్నీ సజావుగా ఉండి ఉంటే, గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఫైనల్‌కి చేర్చిన శ్రేయాస్ అయ్యర్, కెప్టెన్సీ రేసులో ముందువరుసలో ఉండేవాడే. అయితే గాయపడి, జట్టుకి దూరమైన తర్వాత అయ్యర్ పరిస్థితి టీమ్‌లోకి రావడమే కష్టమన్నట్టుగా తయారైంది...

అయ్యర్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నయా కెప్టెన్ రిషబ్ పంత్‌కి టీ20 కెప్టెన్సీ దక్కవచ్చని జోరుగా ప్రచారం జరిగింది. లీగ్ స్టేజ్‌లో ముంబై ఇండియన్స్, సూపర్ కింగ్స్ వంటి జట్లను ఓడించి, టేబుల్ టాపర్‌గా నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్...

రిషబ్ పంత్ జట్టును నడిపించిన తీరు, ఫీల్డ్‌లో సమయానికి తగ్గట్టుగా అతను తీసుకున్న నిర్ణయాలు, అందర్నీ తెగ ఇంప్రెస్ చేశాయి. టీమిండియా సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ధోనీలా, రిషబ్ పంత్ కూడా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కూడా కావడంతో విపరీతమైన మద్ధతు కూడా లభించింది... 

అయితే క్వాలిఫైయర్ 1, క్వాలిఫైయర్ 2 మ్యాచుల్లో ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్. దీంతో రిషబ్ పంత్‌కి కెప్టెన్‌గా సక్సెస్‌ఫుల్ కావడానికి మరింత సమయం, అనుభవం అవసరమనే నిర్ణయానికి వచ్చేశారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

అందుకే రిషబ్ పంత్‌కి అనుభవం వచ్చేవరకూ టీ20 కెప్టెన్సీ పగ్గాలని రోహిత్ శర్మ అందుకోబోతున్నాడు. టీ20 వరల్డ్‌కప్ తర్వాత న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతుంది భారత జట్టు...

సీనియర్లు అందరూ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో బిజీగా ఉండడంతో, మరోసారి శిఖర్ ధావన్ కెప్టెన్సీలోనే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ జరిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఓ భారీ సభను ఏర్పాటు చేసి, టీ20 ఫార్మాట్‌కి కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ...

వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ టోర్నీని రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఆడనుంది భారత జట్టు. ఆ తర్వాత మరో ఏడాది కచ్ఛితంగా క్రికెట్‌లో కొనసాగుతానని రోహిత్ శర్మ భరోసా ఇవ్వడంతో రెండేళ్ల పాటు టీ20 కెప్టెన్‌గా ఉండబోతున్నాడు ‘హిట్ మ్యాన్’..

రోహిత్ శర్మ 2023లో రిటైర్ అవ్వాలని నిర్ణయం తీసుకుంటే, అప్పుడు రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లలో ఎవరికి కెప్టెన్సీ ఇవ్వాలనేది అప్పుడు ఆలోచించాలని ఫిక్స్ అయినట్టు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు..

click me!