Virat Kohli: భార్య, కూతురుతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన కోహ్లి.. దుబాయ్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న కెప్టెన్

Published : Oct 20, 2021, 02:46 PM IST

T20 Worldcup: భారత సారథి విరాట్ కోహ్లి (Virat kohli) ఆటతో పాటే కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తాడు. విదేశీ సిరీస్ ల నిమిత్తం కోహ్లి వెళ్లిన ప్రతి చోటుకు భార్య అనుష్కశర్మ (Anushka Sharmna) ను కూడా తీసుకెళ్తుంటాడు. ఇక ఆ జాబితాలో తాజాగా వారి గారాలపట్టి వామిక (Vamika) కూడా జతకలిసింది. 

PREV
16
Virat Kohli: భార్య, కూతురుతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన కోహ్లి.. దుబాయ్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న కెప్టెన్

యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ (T20 World cup) లో భాగంగా భారత జట్టు (Team India)నేడు ఆస్ట్రేలియా (India vs Australia)తో వార్మప్ మ్యాచ్  లో తలపడనున్నది. గత మ్యాచ్ లో  ఇంగ్లండ్ కు చుక్కలు చూపించిన భారత బ్యాట్స్మెన్.. కంగారూలకు కంగారు పుట్టించాలని  చూస్తున్నారు.

26

ఈ మ్యాచ్ కు ముందు భారత సారథి విరాట్ కోహ్లి.. తన భార్య అనుష్క శర్మ, కూతురు వామిక తో కలిసి దుబాయ్ లోని బ్రేక్ ఫాస్ట్ చేశారు. 

36

ఇందుకు సంబంధించిన ఫోటోను కోహ్లి.. తన సామాజిక మాధ్యమాలలో పంచుకున్నాడు. ఫోటోలో కోహ్లి, అనుష్క లు చిరునవ్వులు చిందిస్తుండగా.. ఎప్పటిలాగే వామిక ముఖం కనిపించకుండా వెనుకవైపు నుంచి  క్లిక్ మనిపించారు. 

46

ఈ ఫోటోను కోహ్లి.. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో పోస్ట్ చేయగానే అది వైరలైంది. ఇప్పటికే ఈ ఫోటోకు 19 లక్షల  లైకులు వచ్చాయి. దీనిపై చాలా  మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వారిలో పలువురు ‘మాకు వామిక దర్శనం ఎప్పుడు కలుగుతుంది’ అని రాస్తున్నారు.

56

రెండ్రోజుల క్రితం అనుష్క.. ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఓ ఫోటోలో కూడా విరాట్ తన కూతురుతో ఆడుకుంటున్నాడు. ఈ ఫోటోను షేర్ చేస్తూ అనుష్క.. ‘నా రోజు మొత్తం ఒకే ఫ్రేమ్ లో’ అని రాసుకొచ్చింది.

66

ఐపీఎల్ కోసం ఫ్యామిలితో కలిసి దుబయ్  వెళ్లిన కోహ్లి.. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ కోసం కూడా అక్కడే ఉన్నాడు. మ్యాచ్ లు లేనప్పుడు ఈ జంట.. క్వారంటైన్ బయో బబుల్ లో కూడా ఎంజాయ్ చేస్తున్నది. 

click me!

Recommended Stories