ఐపీఎల్‌లో విండీస్ ప్లేయర్లకు డిమాండ్ కాస్త ఎక్కువే. ఆస్ట్రేలియా తర్వాతే వెస్టిండీస్ ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు ఎక్కువ ఆసక్తి చూపిస్తాయి. విండీస్ స్టార్ హిట్టర్ సిమ్రాన్ హెట్మయర్, ఐపీఎల్ గత రెండు సీజన్లలోనూ మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు...
ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఐపీఎల్ రెండు సీజన్లలో ఆడిన సిమ్రాన్ హెట్మయర్, ఈసారి రాజస్థాన్ రాయల్స్ తరుపున బరిలో దిగబోతున్నాడు...
210
ఐపీఎల్ 2020 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో, ఆ తర్వాతి సీజన్‌లో రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఆడిన హెట్మయర్, ఈసారి సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఆడబోతున్నాడు...
310
ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.8.5 కోట్ల భారీ ధర దక్కించుకున్న సిమ్రాన్ హెట్మయర్, ఇప్పటికే ఇండియాకి వచ్చి, ఆర్ఆర్ క్యాంపులో కలిశాడు... హెట్మయర్ పింక్ కలర్ హెయిర్ స్టైల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది...
410
‘నిజానికి ఈ ఐడియా గత ఏడాది వచ్చింది. నా భార్య జీనియస్. నేను గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడినప్పుడు, నా జట్టుకు కలర్ వేసుకోమని సలహా ఇచ్చింది...
510
ఎలా ఉంటుందో చూద్దామని రంగు వేస్తానని చెప్పింది. నేను కూడా సరేనని చెప్పా. ఈసారి రాజస్థాన్ రాయల్స్ తరుపున పింక్ జెర్సీలో ఆడబోతున్నా అని తెలిసి, పింక్ కలర్ వేసింది...
610
పోయిన ఏడాదే, నీ జట్టుకి పింక్ కలర్ వేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉందని ఆమె అంది. ఆమె కోరినట్టే ఇప్పుడు ఇలా పింక్ కలర్ జట్టుతో మీ ముందు నిల్చున్నా...’ అంటూ కామెంట్ చేశాడు సిమ్రాన్ హెట్మయర్...
710
తనకి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ అంటే చాలా ఇష్టమని చెప్పిన హెట్మయర్, సింపుల్‌గా ఉంటూ పరుగులు చేయడాన్ని ఇష్టపడతానని చెప్పాడు...
810
హెట్మయర్ భార్య పేరు నిర్వానీ వుమ్‌రావ్... చిన్నతనం నుంచి స్నేహితులైన హెట్మయర్, నిర్వానీ కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసి, పెళ్లి చేసుకున్నారు.
910
తన అందంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నిర్వానీ... సోషల్ మీడియాలో ఘాటు అందాలను పోస్టు చేస్తూ ఉంటుంది.
1010
హెట్మయర్ కంటే అతని భార్య భారీ అందాల ఫోటోలను చూసేందుకే ఎక్కువ మంది అతన్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతారట...