జెర్సీ నెంబర్ 7 సీక్రెట్ చెప్పిన ఎమ్మెస్ ధోనీ... కేవలం ఆ ఒక్క కారణంతోనే...

Published : Mar 17, 2022, 05:58 PM IST

నెంబర్ 7 చాలామందికి ఫెవరెట్, లక్కీ నెంబర్. క్రికెట్, ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కి అయితే నెంబర్ 7 ఓ ఎమోషన్. ఫుట్‌బాల్ ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో నెం.7 జెర్సీకి విపరీతమైన క్రేజ్ తీసుకువస్తే, క్రికెట్ ఫీల్డ్‌లో ఎమ్మెస్ ధోనీ కారణంగా 7 నెంబర్‌కి మంచి పాపులారిటీ దక్కింది...

PREV
18
జెర్సీ నెంబర్ 7 సీక్రెట్ చెప్పిన ఎమ్మెస్ ధోనీ... కేవలం ఆ ఒక్క కారణంతోనే...

సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో మూడు సార్లు మూడు రకాల నెంబర్లతో ఉన్న జెర్సీలను ధరించాడు. కెరీర్ ఆరంభంలో జెర్సీ నెంబర్ 99 ధరించేవాడు టెండూల్కర్...

28

ఆ తర్వాత 33 జెర్సీ నెంబర్ ధరించి చాలా మ్యాచులు ఆడిన సచిన్ టెండూల్కర్, ఆఖరికి 10 నెంబర్ జెర్సీకి ఫిక్స్ అయి... కెరీర్ ఎండింగ్‌లో దస్ నెంబర్‌ జెర్సీతో కనిపించాడు..

38

భాత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే 7 నెంబర్ జెర్సీతో కనిపించాడు. ఐపీఎల్‌లోనూ అదే జెర్సీతో రిటైర్ కాబోతున్నాడు...

48

‘చాలామంది 7 నా లక్కీ నెంబర్ అనుకుంటారు. కానీ అదేమీ లేదు. నాకు లక్కీ నెంబర్లపైన పెద్దగా నమ్మకం కూడా లేదు...

58

నేను ఏ నెంబర్ జెర్సీ సెలక్ట్ చేసుకోవాలా? అని ఆలోచిస్తున్నప్పుడు జూన్ 7న పుట్టాను కాబట్టి, అదే నెంబర్ తీసుకుందామని అనుకున్నా...

68

ఏడో నెలలో ఏడో రోజు కావడంతో అదే నెంబర్‌ బాగుంటుందని నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ కూడా సూచించారు...’ అంటూ కామెంట్ చేశాడు ఎమ్మెస్ ధోనీ...

78

ఐపీఎల్‌కి కొన్ని సీజన్లుగా ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, 2022 సీజన్ తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకుంటాడని ప్రచారం జరుగుతోంది...

88

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాని రూ.16 కోట్లకు, దీపక్ చాహార్‌ని మెగా వేలంలో రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన చెన్నైసూపర్ కింగ్స్, ఎమ్మెస్ ధోనీని రూ.12 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. 

Read more Photos on
click me!

Recommended Stories