విరాట్ కోహ్లీ తప్పించుకున్నాడు, అసలైన ఛాలెంజ్ రోహిత్ శర్మకే... ఐపీఎల్ 2022లో...

Published : Mar 17, 2022, 06:38 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. 10 జట్లు తలబడబోతున్న ఈ సీజన్ కోసం ఐపీఎల్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మకు, ఐపీఎల్ 2022 మరో కొత్త ఛాలెంజ్ కానుంది...

PREV
111
విరాట్ కోహ్లీ తప్పించుకున్నాడు, అసలైన ఛాలెంజ్ రోహిత్ శర్మకే... ఐపీఎల్ 2022లో...

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ గుర్తింపు తెచ్చుకున్నాడు. 8 సీజన్లలోనే ఐదు టైటిల్స్ గెలిచాడు ముంబై ఇండియన్స్ సారథి...

211

అయితే ముంబై ఇండియన్స్‌లో జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి స్టార్లు ఉండడంతో రోహిత్ శర్మ ప్లేస్‌లో ఎవరున్నా టైటిల్ కొట్టేవారని కామెంట్లు వినిపించాయి...

311

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ‘ముంబై ఇండియన్స్‌ టీమ్‌లో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అలాంటి ప్లేయర్లతో నిండిన టీమ్‌ను ఎవ్వరైనా ఈజీగా గెలిపించగలరు. విరాట్‌కి ఇలాంటి టీమ్ దొరికితే ఎప్పుడో టైటిల్ గెలిచేవాడు...’ అంటూ కామెంట్ చేశాడు...

411

అయితే ఐపీఎల్ 2019, 2020 సీజన్ టైటిల్స్ గెలిచిన జట్టుతో పోలిస్తే, ఈసారి ముంబై ఇండియన్స్ జట్టులో చాలా మార్పులే జరిగాయి. మెగా వేలం కారణంగా ముంబై కీ ప్లేయర్లను కోల్పోవాల్సి వచ్చింది...
 

511

గత సీజన్లలలో మంచి ప్రదర్శన ఇచ్చిన ఓపెనర్ క్వింటన్ డి కాక్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహార్ వేరే జట్ల తరుపున ఆడబోతున్నారు...

611

సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, జస్ప్రిత్ బుమ్రా, కిరన్ పోలార్డ్ వంటి కోర్ టీమ్ ప్లేయర్లు జట్టులో ఉన్నా, మిగిలిన వారంతా కొత్త ప్లేయర్లే. ఈ టీమ్‌ని రోహిత్ శర్మ ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది..

711

ఇప్పటికే ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మకు ఈ సీజన్‌లో ఫెయిల్ అయినా పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. అయితే ఫ్యాన్స్‌ నుంచి విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. 

811

అదీకాకుండా ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత కొన్ని నెలల గ్యాప్‌లోనే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడబోతోంది భారత జట్టు. ఐపీఎల్ ప్రభావం, వరల్డ్ కప్‌పై పడొచ్చు...

911

విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ కెప్టెన్సీకి రాజీనామా ఇవ్వడంతో పాటు టీమిండియా కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. ఇక మిగిలింది బ్యాట్‌తో చేసే పర్ఫామెన్సే. కెప్టెన్సీ తలనొప్పులు విరాట్‌కి ఉండవు...

1011

స్వదేశంలో వరుస సిరీస్‌లు గెలిచి, రికార్డులు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ... ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌ పర్యటనకి వెళ్లే టీమిండియాకి సారథిగా ఉండబోతున్నాడు...

1111

ఐపీఎల్, ఇంగ్లాండ్ టూర్‌లో సక్సెస్ అయితేనే రోహిత్ శర్మపై ట్రోలింగ్‌ తగ్గుతుంది. లేదంటే హిట్ మ్యాన్‌ను ఓ రేంజ్‌లో ఆడుకోవడానికి రెఢీగా ఉన్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్... 

Read more Photos on
click me!

Recommended Stories