ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది. ముఖ్యంగా గత సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్ విలియంసన్ అట్టర్ ఫ్లాప్ అయ్యి, టీమ్‌కి భారంగా మారాడు...
Image credit: PTI
దెబ్బకు కేన్ మామని వేలానికి వదిలేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని నడిపించే సారథిని కనిపెట్టడం ఆరెంజ్ ఆర్మీకి చాలా పెద్ద సమస్యగా మారింది...
ఐపీఎల్ 2023 మినీ వేలంలో మయాంక్ అగర్వాల్‌ని రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఇంగ్లాండ్ బ్యాటర్ హారీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్లు ఖర్చు చేసింది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్సీ చేసిన మయాంక్, ఆరెంజ్ ఆర్మీని లీడ్ చేస్తాడని ప్రచారం జరిగింది...
అయితే సౌతాఫ్రికా20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టరన్ కేప్ టీమ్‌ని విజేతగా నిలిపిన సౌతాఫ్రికా బ్యాటర్ అయిడిన్ మార్క్‌రమ్, ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్‌గా రూట్ క్లియర్ చేసుకున్నాడు. #SA20 లీగ్‌కి ముందు కెప్టెన్‌గా అండర్19 వన్డే వరల్డ్ కప్ కూడా గెలిచాడు అయిడిన్ మార్క్‌రమ్...
SA20 Final
సన్‌రైజర్స్ టీమ్‌కి కెప్టెన్‌గానే కాకుండా సౌతాఫ్రికా20 లీగ్‌లో 311 పరుగులు, 11 వికెట్లు తీసి అదరగొట్టాడు అయిడిన్ మార్క్‌రమ్. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ కూడా గెలిచిన మార్క్‌రమ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని నడిపించడం దాదాపు ఖాయమైపోయినట్టే...