ముగ్గురు స్పిన్నర్లతో ఆడతాం! ఫైనల్‌కి వెళ్లడమే మా టార్గెట్... - వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్...

First Published Feb 7, 2023, 3:07 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత జట్టు, ఫైనల్ బెర్త్ కోసం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 9న తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టుకి ముందు టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్నాడు..

KL Rahul

రోహిత్ శర్మ గాయపడడంతో బంగ్లాదేశ్ టూర్‌లో టెస్టు సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, పెళ్లైన రెండు రోజులకే టీమ్‌తో కలిశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టు సిరీస్‌కి వైస్ కెప్టన్‌గా వ్యవహరిస్తున్నాడు...

Image credit: PTI

‘ఇంకా మొదటి టెస్టు ఆడే టీమ్‌ని డిసైడ్ చేయలేదు. టీమ్‌లో ఇంకా కొన్ని గ్యాప్‌లను ఫిల్ చేయాల్సి ఉంది. నేను ఓపెనర్‌గానే రావాలని అనుకోవడం లేదు. అవసరమైతే మిడిల్ ఆర్డర్‌లో ఆడడానికి కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు...

పరిస్థితులను తగట్టు బ్యాటింగ్ చేస్తాం. టెస్టులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయాల్సి వస్తే, అలాగే ఆడతాం. ఒక ప్లాన్‌తో బరిలో దిగి అలాగే ఆడాలని అనుకోవడం లేదు. గ్రౌండ్‌లోకి దిగిన తర్వాత ప్లాన్‌లో మార్పులు చేయాల్సి వచ్చినా చేయడానికి రెఢీగా ఉంటాం...

ఆస్ట్రేలియా టీమ్ ప్రాక్టీస్ గేమ్స్ ఆడడం లేదు. అయితే ప్రాక్టీస్ గేమ్స్ ఆడాలా? వద్దా? అనేది వారి ఇష్టం. వార్మప్ మ్యాచుల వల్ల పెద్దగా ఒరిగేదీ ఏమీ ఉండదని నా అభిప్రాయం. వాళ్ల టీమ్ పటిష్టంగా ఉంది, ఎలా ప్రాక్టీస్ చేయాలో వాళ్లకు తెలుసు. 

ఆస్ట్రేలియాలో చాలా మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. ఇది మాకు ఛాలెంజ్ కావచ్చు. అయితే మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్‌లకు లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లపై మంచి రికార్డు ఉంది. దాన్ని చక్కగా వాడుకుంటాం...
 

ఈ సిరీస్ తప్పకుండా గెలవాలి. అందుకే స్పిన్నర్లను ఎదుర్కోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాలనుకుంటున్నాం... అందుకే ముగ్గురు స్పిన్నర్లను ఆడించబోతున్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు కెఎల్ రాహుల్.. 
 

click me!