టెస్టులకు బుమ్రా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు వాళ్లిద్దరిలో ఒకరిని కెప్టెన్ చేయాలి : ఊతప్ప ఇంట్రెస్టింగ్ కామెంట్

Published : Jul 26, 2022, 06:03 PM IST

Team India Captain: గత ఏడాది కాలంగా టీమిండియాకు వరుసగా సారథులను మారుస్తున్న నేపథ్యంలో బీసీసీఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో  టీమిండియా వెటరన్ రాబిన్ ఊతప్ప దీనిపై స్పందించాడు. 

PREV
16
టెస్టులకు బుమ్రా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు వాళ్లిద్దరిలో ఒకరిని కెప్టెన్ చేయాలి : ఊతప్ప ఇంట్రెస్టింగ్ కామెంట్

టీమిండియా రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ ఓ సిరీస్ కు ప్రెజంట్ మరో సిరీస్ కు ఆప్సెంట్ అన్నట్టుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో భారత జట్టు మేనేజ్మెంట్ సిరీస్ కు ఓ సారథి అనే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. టీమిండియాకు విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఏడాది కాలంలో జట్టుకు సుమారు 8 మంది కెప్టెన్లుగా పనిచేశారు. 

26

వరుసగా సారథులను మారుస్తున్న నేపథ్యంలో బీసీసీఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో  టీమిండియా వెటరన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప టీమిండియా భవిష్యత్ సారథిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

36

తాజాగా షేర్ చాట్ నిర్వహించిన క్రిక్ చాట్ ఆడియో రూమ్ కార్యక్రమానికి ఊతప్పు గెస్ట్ గా వచ్చాడు. ఈ సందర్బంగా అతడు మాట్లాడుతూ.. ‘నా అభిప్రాయం ప్రకారమైతే టీమిండియాకు టెస్టులలో జస్ప్రీత్ బుమ్రా.. వన్డేలలో కెఎల్ రాహుల్, రిషభ్ పంత్ లలో ఎవరికో ఒకరికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలి..’ అని తెలిపాడు. 

46

బుమ్రా టెస్టు క్రికెట్ ను ఏలుతాడని, అతడు తన వ్యూహాలు, ప్రణాళికలతో జట్టును మరింత ముందుకు తీసుకెళ్తాడని కొద్దికాలంగా క్రికెట్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంగ్లాండ్ తో ఇటీవలే ఎడ్జ్బాస్టన్ వేదికగా ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టు లో  అతడు భారత్ కు సారథ్యం వహించాడు.  అయితే తొలి నాలుగు రోజులు ఆ టెస్టులో భారత్ దే ఆధిపత్యం అయినప్పటికీ  చివర్లో పట్టు విడవడంతో ఓటమి తప్పలేదు. 

56

ఇక పరిమిత ఓవర్ల విషయానికొస్తే.. రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత జట్టు ఓపెనర్ కెఎల్ రాహుల్ దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డేలకు  సారథిగా పనిచేశాడు.  అయితే ఆ  సిరీస్ లో భారత్ 0-3తో ఓడింది. దీంతో రాహుల్ కు కెప్టెన్సీ లక్షణాలు బొత్తిగా లేవని తేల్చేశారు క్రికెట్ విశ్లేషకులు. 

66

పంత్ కూడా టీమిండియా కెప్టెన్సీ రేసులో ఉన్నవాడే. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు సారథిగా పనిచేస్తున్న అతడు.. ఐపీఎల్-15 ముగిశాక స్వదేశంలో ముగిసిన దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కు సారథిగా వ్కవహరించాడు. పంత్ సారథ్యంలో భారత్.. తొలి రెండు మ్యాచులు ఓడినా తర్వాత రెండింటిలో నెగ్గింది.  

click me!

Recommended Stories