Kumar Kartikeya: తన కుటుంబానికి భారం కాకూడదనుకుని ఇల్లు వదిలివెళ్లిన ఆ కుర్రాడు.. 9 ఏళ్ల తర్వాత ఇంటికి చేరాడు. సుదీర్ఘ కాలం తర్వాత తల్లిని చూసి భావోద్వేగానికి లోనయ్యాడు.
ఐపీఎల్ లో ఒక్కో విజేతది ఒక్కో విజయగాథ. ముఖ్యంగా పేద కుటుంబాల నుంచి వచ్చి విజయవంతమైన క్రికెటర్ల జీవితాలలో కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు. ఆ జాబితాలో తొలి వరుసలో నిలిచేది మధ్యప్రదేశ్ కు చెందిన కుమార్ కార్తికేయ.
26
15 ఏళ్ల వయసులో కుటుంబ ఆర్థిక పరిస్థితులను చూసి ఇంట్లోనే ఉండి కుటుంబానికి మరింత భారం కాకూడదని భావించిన కార్తికేయ.. ఎట్టకేలకు 9 ఏళ్ల 3 నెలల తర్వాత తన తల్లిని కలుసుకున్నాడు. తన కుటుంబం కోసం పంత పట్టి.. ఎన్నో కష్టాలకు ఓర్చి చివరికి విజేతగా తల్లిని కలిశాడు.
36
తాజాగా కార్తికేయ ట్విటర్ వేదికగా ట్వీట్ చేస్తూ... ‘9 ఏళ్ల 3 నెలల తర్వాత అమ్మ, కుటుంబాన్ని కలుసుకున్నా. నా భావాలను మాటల్లో చెప్పలేను..’ అని భావోద్వేగానికి లోనయ్యాడు. తన తల్లితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ పై క్యాప్షన్ పెట్టాడు కార్తికేయ.
46
పేదరికం కారణంగా తన 15 ఏళ్ల వయసులోనే కార్తికేయ ఇంటిని వీడాడు. మధ్యప్రదేశ్ నుంచి ముంబైకి చేరి అక్కడ ఓ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. మధ్యాహ్నం భోజనం చేస్తే డబ్బులు ఖర్చవుతాయని ఏడాదిపాటు మధ్యాహ్నం పూట తినడమే మానేశాడు.
56
Kumar Kartikeya Singh
కష్టాల కడలిని ఈదే క్రమంలో అతడు తన క్రికెట్ కలను మరిచిపోలేదు. ఓవైపు పని చేసుకుంటూనే ప్రాక్టీస్ చేశాడు. ఆర్థికంగా కుదురుకున్నాక తన ఫోకస్ ను మొత్తం ఆట మీదకే షిఫ్ట్ చేసి 2018లో మధ్యప్రదేశ్ రంజీ జట్టులో చోటు సంపాదించాడు.
66
రంజీలలో రాణించిన కార్తికేయ లోని ప్రతిభను గుర్తించిన ముంబై ఇండియన్స్.. ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో అతడిని దక్కించుకుంది. ఈ సీజన్ లో కార్తికేయ.. ముంబై తరఫున రాణించాడు. ఆడింది నాలుగు మ్యాచులే అయినా తాను ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు.