యూఏఈ చేరుకున్న ముంబై ప్లేయర్లు రోహిత్ శర్మ అండ్ కో... టెస్టు మ్యాచ్ రద్దు ఇందుకోసమేనా అంటూ...

First Published Sep 11, 2021, 4:29 PM IST

ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరగాల్సిన ఐదో టెస్టు రద్దు కావడంతో భారత ఆటగాళ్లు, ఐపీఎల్ 2021 ఫేజ్ 2 కోసం యూఏఈ చేరుకుంటున్నారు. ఇప్పుటికే ముంబై ప్లేయర్లు, ప్రత్యేక విమానంలో దుబాయ్‌లో వాలిపోయారు...

శనివారం ఉదయం ముంబై ఇండియన్స్ ప్లేయర్లు రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌‌లకు RT PCT పరీక్షలు నిర్వహించారు...

ఆ తర్వాత కుటుంబ సమేతంగా ప్రైవేట్ ఛార్టెడ్ విమానంలో అబుదాబి చేరుకున్నారు ముంబై ప్లేయర్లు.. అబుదాబి విమానాశ్రయంలో వీరికి మరోసారి కరనా పరీక్షలు నిర్వహించారు..

అబుదాబి చేరుకున్న ముంబై ఇండియన్స్ ప్లేయర్లు, ఆరు రోజుల క్వారంటైన్ ముగిసిన తర్వాత జట్టుతో కలుస్తారని ప్రకటించింది సదరు ఫ్రాంఛైజీ...

అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లు విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కూడా ప్రత్యేక ఛార్టెడ్ విమానంలో యూఏఈ చేరుకోబోతున్నారు...

సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేయర్ల కోసం ఆయా ఫ్రాంఛైజీలు ప్రైవేటు ఛార్టెడ్ విమానాలను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం...

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, ఛతేశ్వర్ పూజారా మాత్రం ప్రత్యేక విమానంలో కాకుండా కమర్షియల్ ఫ్లైట్ ద్వారా లండన్ నుంచి దుబాయ్ చేరుకోనున్నారు...

ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీలు మాత్రం ఆటగాళ్లకు తీసుకురావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు... 

ఈ జట్లకు చెందిన రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, అజింకా రహానే, ఇషాంత్ శర్మ మాత్రం మాంచెస్టర్ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్ ద్వారా దుబాయ్‌కి బయలుదేరారు...

రెండు సార్లు నెగిటివ్ రిజల్ట్ వచ్చినప్పటికీ ఇంగ్లాండ్ టూర్‌లో భారత బృందంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల కారణంగా ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండబోతున్నారు..

ఐదో టెస్టు రద్దైన వెంటనే ఆటగాళ్లు, ఐపీఎల్ కోసం యూఏఈకి పయనం అవుతుండడంతో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాగన్ మరోసారి భారత ఆటగాళ్లపై కామెంట్లు చేశాడు...

‘ఐపీఎల్ జట్లు, ఆటగాళ్ల కోసం ఛార్టెడ్ ఫ్లైట్స్ ఏర్పాటు చేస్తున్నాయి. యూఏఈలో ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉండబోతున్నారు. మరో ఏడు రోజుల్లో టోర్నీ ప్రారంభం కానుంది... అయినా ఐపీఎల్ కోసం ఐదో టెస్టు క్యాన్సిల్ చేశారని చెప్పకండి...’ అంటూ ట్వీట్ చేశాడు మైకెల్ వాగన్...

కొందరు టీమిండియా ఫ్యాన్స్ మాత్రం వాగన్‌కి స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు. మ్యాచ్ రద్దయిన తర్వాత షెడ్యూల్ ప్రకారం ఐదో రోజు ముగిసేవరకూ మాంచెస్టర్‌లోనే ఉండిపొమ్మంటారా? ఏంది? అంటూ కామెంట్లు చేస్తున్నారు...

click me!