ఐపీఎల్ 2021 నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు... ఐదో టెస్టు రద్దు చేశారనే కోపంతో...

First Published Sep 11, 2021, 3:51 PM IST

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు, ఆఖరి నిమిషంలో రద్దు అయిన విషయం తెలిసిందే. భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడం, కొందరు ఆటగాళ్లు మ్యాచ్ ఆడడానికి భయపడడంతో టెస్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఇరు జట్లు...

ఐదో టెస్టు రద్దు కావడం వల్ల ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి దాదాపు 200 నుంచి 250 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది... 

ఆర్థికంగానే కాకుండా మ్యాచ్‌ కోసం ఎంతో కష్టపడిన ప్లేయర్లు, ఎంతో ఆశగా మ్యాచ్ చూద్దామని వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన అభిమానులు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది...

ఎన్ని కారణాలు చెప్పినా, ఐదో టెస్టు సమయంలో కరోనా బారిన పడితే ఐపీఎల్‌లో ఆడలేమనే కారణంగానే భారత క్రికెటర్లు... మ్యాచ్ ఆడలేదన్నది చాలామంది వాదన, అభిప్రాయం...

మ్యాచ్ రద్దు కాగానే, ఆయా ఫ్రాంఛైజీలు హుటాహుటీన క్రికెటర్లను ప్రత్యేక ఛార్టెట్ విమానాల్లో యూఏఈకి తీసుకొచ్చేస్తున్నాయి కూడా. 

ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లేయర్లు రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్... ప్రత్యేక విమానాల్లో యూఏఈ చేరుకున్నారు...

ఈ సంఘటనలతో బాగా హర్ట్ అయిన కొందరు ఇంగ్లాండ్ క్రికెటర్లు, ఐపీఎల్ 2021 ఫేజ్ 2 నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారట...

జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, క్రిస్ వోక్స్... ముగ్గురూ ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో ఆడకూడదని నిర్ణయం తీసుకున్నారు. 

నెం.1 టీ20 ప్లేయర్ డేవిడ్ మలాన్‌ను పంజాబ్ కింగ్స్ బేస్ ప్రైజ్ రూ.కోటిన్నరకి దక్కించుకుంది. అయితే ఫేజ్ 1లో అతను ఒకే మ్యాచ్ ఆడి, 26 పరుగులు చేశాడు...

ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఫేజ్ 1లో మూడు మ్యాచులు ఆడిన క్రిస్ వోక్స్, 5 వికెట్లు తీసి బ్యాటింగ్‌లో 15 పరుగులు చేశాడు...

వీరిద్దరు రాకపోయినా ఆ జట్లపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. అయితే జానీ బెయిర్ స్టో ఆడకపోతే అది సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌కి పెద్ద దెబ్బే...

ఇప్పటికే ఏడు మ్యాచుల్లో ఆరింట్లో ఓడిన సన్‌రైజర్స్, ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన ఏడు మ్యాచుల్లో కచ్ఛితంగా గెలవాల్సి ఉంటుంది...

బ్యాటింగ్‌లో రాణిస్తున్న బెయిర్ స్టో కూడా లేకపోతే, ఆరెంజ్ ఆర్మీ ఏ విధంగా ఉంటుందోనని భయపడుతున్నారు అభిమానులు...

అయితే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ దగ్గరపడుతుండడంతో మిగిలిన ఇంగ్లాండ్ క్రికెటర్లు సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ, ఇయాన్ మోర్గాన్... ఐపీఎల్ ఫేజ్ 2లో ఆడాలని నిర్ణయించుకున్నారు...

click me!