అతని కంటే సూర్యకుమార్ యాదవ్ చాలా బెస్ట్ ప్లేయర్... గౌతమ్ గంభీర్ కామెంట్...

Published : Sep 11, 2021, 03:24 PM ISTUpdated : Oct 25, 2021, 11:26 AM IST

టీ20 వరల్డ్‌కప్‌కి ప్రకటించిన భారత జట్టులో సీనియర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌కి చోటు దక్కలేదు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కి చోటు ఇచ్చిన సెలక్టర్లు, అయ్యర్‌ని కేవలం స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు...

PREV
112
అతని కంటే సూర్యకుమార్ యాదవ్ చాలా బెస్ట్ ప్లేయర్... గౌతమ్ గంభీర్ కామెంట్...

టీమిండియాను ఎన్నో ఏళ్ల పాటు వేధించిన సమస్య టూ డౌన్ బ్యాట్స్‌మెన్. రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత వన్డే, టీ20ల్లో భారత జట్టును ఈ సమస్య వెంటాడుతూనే ఉంది...

212

కొన్నాళ్ల పాటు అంబటి రాయుడిని నాలుగో స్థానంలో ఆడించి, ప్రయోగాలు చేసిన టీమిండియా... కొంతమేర సక్సెస్ సాధించగలిగింది...

312

అయితే వన్డే వరల్డ్‌కప్ 2019 టోర్నీలో శ్రేయాస్ అయ్యర్‌కి చోటు దక్కలేదు. అతని స్థానంలో 3డీ ప్లేయర్‌గా విజయ్ శంకర్‌కి అవకాశం దక్కింది.. అప్పట్లో ఇది పెద్ద దుమారమే రేపింది..

412
suryakumar yadav

ఈసారి మాత్రం సూర్యకుమార్ యాదవ్ ఎంపికపై అలాంటి వివాదం ఏమీ రేగలేదు. కారణంగా ఆ ప్లేస్‌కి శ్రేయాస్ అయ్యర్ కంటే, యాదవ్ కరెక్ట్ అని టీమిండియా ఫ్యాన్స్ చాలామంది భావించడం...

512

భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా ఇదే విధంగా కామెంట్ చేశాడు... ‘సూర్యకుమార్ యాదవ్ చాలా స్పెషల్ ప్లేయర్.. శ్రేయాస్ అయ్యర్ టాలెంటెడ్ కానీ సూర్యకుమార్ యాదవ్‌లా ఆడలేడు...

612

ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ మల్టీ టాలెంటెడ్ బ్యాట్స్‌మెన్. అతను మైదానానికి నలువైపులా పరుగులు సాధించగలడు...

712

టీ20 ఫార్మాట్‌లో ఇలాంటి అసాధారణ బ్యాట్స్‌మెన్ కావాలి. బ్యాటింగ్‌లోనే కాదు, సూర్యకుమార్ యాదవ్ గ్రౌండ్‌లో ఉంటే, ఓ స్పెషల్ వైబ్రేషన్ వస్తుంది...

812

సూర్యకుమార్ యాదవ్ ఆడే లేట్ కట్స్, ఎక్స్‌ట్రా కవర్ షాట్స్, లాప్ షాట్స్ చాలా చాలా స్పెషల్. మైదానంలో యాదవ్ ఆడే షాట్స్, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందిస్తాయి...

912

నాలుగో స్థానంలో వచ్చే బ్యాట్స్‌మెన్, వికెట్లను కాపాడుతూ వేగంగా పరుగులు చేయగల సమర్థుడై ఉండాలి. శ్రేయాస్ అయ్యర్ వికెట్ కాపాడుకోగలడు, కానీ యాదవ్‌లా వేగంగా పరుగులు చేస్తూ, బౌలర్లపై ఒత్తిడి పెంచలేడు...

1012

అందుకే టీ20 వరల్డ్‌కప్‌లో శ్రేయాస్ అయ్యర్ కంటే సూర్యకుమార్ యాదవ్‌‌ని ఎంపిక చేయడమే కరెక్ట్ నిర్ణయం...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...

1112
Shreyas Iyer

వాస్తవానికి పరిస్థితులు సరిగా ఉంటే, నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఆడేవాడు. అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడిన శ్రేయాస్ అయ్యర్... దాదాపు నాలుగు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు.

1212

ఈ కారణంగానే లంక టూర్‌లో భారత జట్టుకి కెప్టెన్సీ వహించే అద్భుత అవకాశాన్ని చేజార్చుకున్న శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు... 

click me!

Recommended Stories