9 ఏళ్ల 2 నెలల 3 రోజులకు ఇంటికి చేరిన ముంబై ఇండియన్స్ ప్లేయర్ కుమార కార్తీకేయ... ఇచ్చిన మాట కోసం...

First Published Jun 28, 2022, 6:03 PM IST

పంతం పట్టుకుంటే, ప్రాణాలు పోతున్నా విడవరు కొందరు. ఇచ్చిన మాట కోసం పుట్టిన ఊరుని, కన్న వాళ్లని వదిలి వెళ్లినవారి కథలను చాలా సినిమాల్లో చూసే ఉంటాం. అలాంటి కథే ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన కుమార కార్తీకేయది...

జీవితంలో ఏదైనా సాధించిన తర్వాత తిరిగి ఇంటికి వస్తానని 9 ఏళ్ల క్రితం ఇంట్లోనుంచి భీష్మ ప్రతిజ్ఞ చేసి బయటికి వచ్చేశాడు కుమార కార్తీకేయ. ఇంట్లో వాళ్లు రమ్మని పిలిచినా, లక్ష్యం సాధించేవారకు భవబంధాలకు దూరంగా ఉండాలని డిసైడ్ చేసుకున్న కుమార కార్తీకేయ... ఎట్టకేలకు 9 ఏళ్ల 2 నెలల 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు...

‘నేను అనుకున్నది ఈ ఏడాది సాధించా. అటు ఐపీఎల్‌లో,ఇటు రంజీ ట్రోఫీలో సాధించిన సక్సెస్ నాకెంతో సంతృప్తినిచ్చింది. నేనెంటో ప్రపంచానికి పరిచయమైంది. అందుకే ఇంటికి తిరిగి వెళ్తున్నా. 9 ఏళ్ల తర్వాత అమ్మనాన్నలకు కలవబోతున్నా అనే ఫీలింగ్ చాలా గొప్పగా ఉంది. ఈ 20-25 రోజుల బ్రేక్ సమయం మొత్తం వారితోనే గడపాలని ఫిక్స్ అయ్యా...’ అంటూ చెప్పుకొచ్చాడు కుమార కార్తీకేయ సింగ్.. 

ఐపీఎల్ 2022 సీజన్‌లో 8 మ్యాచుల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది ముంబై ఇండియన్స్. ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, మొదటి 8 మ్యాచుల్లో జట్టులో ఎన్ని మార్పులు చేసినా ఏవీ వర్కవుట్ కాలేదు. అయితే ఎట్టకేలకు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి విజయం అందుకుంది ముంబై...

Kumar Kartikeya Singh

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌లో స్టార్ ప్లేయర్లు లేకపోయినా తిలక్ వర్మ, బేబీ ఏబీడీ డేవాల్డ్ బ్రేవిస్‌, కుమార కార్తీకేయ సత్తా చాటారు. గాయం కారణంగా సీజన్‌ మొత్తానికి దూరమైన మహ్మద్ అర్షద్ ఖాన్ స్థానంలో కుమార్ కార్తీకేయ సింగ్‌ను జట్టులోకి తీసుకుంది ముంబై ఇండియన్స్‌. తొలి మ్యాచ్‌లోనే తన టాలెంట్ నిరూపించుకున్నాడీ యంగ్ బౌలర్...

Mumbai Indians

4 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చిన కుమార్ కార్తీకేయ సింగ్, ఐపీఎల్‌లో వేసిన రెండో బంతికే సంజూ శాంసన్‌ను అవుట్ చేశాడు... 4.80 ఎకానమీతో పరుగులు ఇచ్చిన కుమార్ కార్తీకేయ, ముంబై ఇండియన్స్ తరుపున బెస్ట్ బౌలింగ్ నమోదుచేశాడు..

Image credit: PTI

24 ఏళ్ల కుమార్ కార్తీకేయ, మధ్యప్రదేశ్ తరుపున రంజీ ట్రోఫీ 2022లో 32 వికెట్లు తీసి, సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శామ్స్ ములానీ తర్వాతి స్థానంలో నిలిచాడు...

click me!