IPL 2021: అర్జున్ టెండూల్కర్ కు గాయం.. మరో ప్లేయర్ ను టీమ్ లోకి తీసుకున్న ముంబయి

First Published | Sep 29, 2021, 9:08 PM IST

Arjun Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఏకైక కుమారుడు, ఐపీఎల్ లో ముంబయి తరఫున ఎంపికైన అర్జున్ టెండూల్కర్ గాయం బారిన పడ్డాడు. 

ఐపీఎల్ లో అరంగ్రేటం కోసం వేయి కండ్లతో వేచి చూస్తున్న సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ మరోసారి నిరాశే ఎదురైంది. 

గాయం కారణంగా అర్జున్ టెండూల్కర్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ముంబయి యాజమాన్యం ట్విట్టర్ ద్వారా పేర్కొంది. అర్జున్ స్థానంలో రైట్ ఆర్మ్ మీడియం పేసర్ సిమర్జీత్ కౌర్ ను ఎంపిక చేసినట్టు తెలిపింది. 


ఈ ఏడాది ఐపీఎల్ ఆక్షన్ లో ప్రాథమిక ధర రూ. 20 లక్షలతో అర్జున్ ను చేజిక్కించుకున్న ముంబయి.. ఇంతవరకు అతడిని ఆడించలేదు. 

కాగా.. సిమర్జీత్ కౌర్ ఇప్పటివరకు 15 టీ 20 మ్యాచ్ లు ఆడాడు. ఇటీవల శ్రీలంక పర్యటనకు  వెళ్లిన భారత జట్టులో నెట్ బౌలర్ గా వెళ్లాడు. 

Latest Videos

click me!