IPL 2021 RCB vs RR: ఐపీఎల్ లో మరో కీలక సమరానికి తెరలేసింది. ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం మూడు జట్లతో పోటీ ఎదుర్కొంటున్న రాజస్థాన్ రాయల్స్.. నిలవాలంటే గెలవాలనే విధంగా దానికి పరిస్థితులు మారాయి. మరోవైపు ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది.
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్-14 సీజన్ లోని 43 వ మ్యాచ్ లో బలమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును రాజస్థాన్ రాయల్స్ ఢీకొంటున్నది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. మందకోడిగా ఉండే ఫిచ్ నెమ్మదిగా బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండటంతో కోహ్లి బౌలింగ్ ఎంచుకున్నాడు.
28
కాగా, ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఒక మార్పు చేశాయి. రాజస్థాన్ రాయల్స్ నుంచి జయదేవ్ ఉనద్కత్ కు విశ్రాంతినిచ్చి కార్తీక్ త్యాగిని జట్టులోకి తీసుకున్నారు. బెంగళూరు కూడా కైల్ జమీసన్ స్థానంలో గార్టన్ కు తుది జట్టులో చోటు కల్పించింది. గార్టన్ కు ఇదే తొలి ఐపీఎల్ అరంగ్రేట మ్యాచ్.
38
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం పది మ్యాచ్ లు ఆడి 6 విజయాలతో కలుపుకని (12 పాయింట్లు) పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
48
ఇక రాజస్థాన్ రాయల్స్ ఆడిన పది మ్యాచుల్లో నాలుగు నెగ్గి ఆరింటిలో ఓడి ఎనిమిది పాయింట్లతో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే ఆ జట్టుకు ఈ మ్యాచ్ లో విజయం అత్యావశ్యకం.
58
గత మ్యాచ్ లో పటిష్ట ముంబయిని మట్టి కరిపించి జోరు మీదున్న బెంగళూరు ఈ గేమ్ కూడా నెగ్గి నెట్ రన్ రేట్, ఇతర జట్ల ఫలితాల గోల లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది.
68
మరోవైపు రాజస్థానేమో గత రెండు మ్యాచుల్లో అనూహ్య పరాజయాలు చవిచూసి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నది.