బ్లూ కలర్ జెర్సీలో ఆర్‌సీబీ ప్లేయర్లు... కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి కృతజ్ఞతగా...

Published : Sep 14, 2021, 01:13 PM IST

ఓ రకంగా చెప్పాలంటే టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండూ ఒకే కోవకు చెందినవారు. ఆయనకి వరుసగా ఎన్ని ఫ్లాపులు క్రేజ్ ఏ మాత్రం తగ్గదు, ఆర్‌సీబీ ఎన్ని సీజన్లలో నిరుత్సాహపరిచినా క్రేజ్ తగ్గలేదు...

PREV
18
బ్లూ కలర్ జెర్సీలో ఆర్‌సీబీ ప్లేయర్లు... కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి కృతజ్ఞతగా...

RCB Blue Jersey

ప్రతీ సీజన్ ఆరంభానికి ముందు ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ తెగ హడావుడి చేయడం, ఆట మొదలయ్యాక విరాట్ సేన పర్ఫామెన్స్ చూసి నీరుగారిపోవడం చాలా ఏళ్లుగా జరుగుతూనే వస్తోంది... అయితే ఏ మాత్రం నిరుత్సాహపడకుండా, ప్రతీ ఏడాది ఆర్‌సీబీ సపోర్టర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది..

28

ఈ ఏడాది ఐపీఎల్‌ను ఘనంగా ఆరంభించిన ఆర్‌సీబీ, వరుసగా నాలుగు విజయాలను అందుకుని మంచి ఊపుమీద ఉన్నట్టు కనిపించింది...

38

అయితే ఐదో మ్యాచ్‌లో సీఎస్‌కే చేతుల్లో చిత్తుగా ఓడిన రాయల్ ఛాలెంజర్స్... మొదటి ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది...

48

మిగిలిన ఏడు మ్యాచుల్లో మరో మూడు విజయాలు అందుకుంటే చాలు, ఇతర ఫ్రాంఛైజీల పర్ఫామెన్స్‌తో పనిలేకుండా నేరుగా ప్లేఆఫ్‌కి చేరుతుంది ఆర్‌సీబీ... 

58

యూఏఈలో జరిగే ఐపీఎల్ ఫేజ్ 2లో తమ మొదటి మ్యాచ్‌లో ఎరుపు రంగు జెర్సీలో కాకుండా బ్లూ కలర్ జెర్సీలో బరిలో దిగనున్నారు రాయల్ ఛాలెంజర్స్...

68

యూఏఈలో జరిగే ఐపీఎల్ 2021 ఫేజ్‌2లో మొదటి మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలబడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఈ మ్యాచ్‌లో బ్లూ కలర్ జెర్సీలో కనిపించబోతున్నారు ఆర్‌సీబీ ప్లేయర్లు. 

78

రెండేళ్లుగా కరోనాపై నిర్విరామంగా యుద్ధం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి కృతజ్ఞతగా బ్లూ కలర్ జెర్సీలో కనిపించబోతున్నారు ఆర్‌సీబీ ప్లేయర్లు..

88

ప్రతీ ఏడాది ఏదో ఒక సాంఘిక, సామాజిక సంక్షేమ కార్యక్రమం కోసం ఓ మ్యాచ్‌లో ప్రత్యేకంగా గ్రీన్ కలర్ జెర్సీల్లో కనిపించే ఆర్‌సీబీ ప్లేయర్లు, ఈసారి బ్లూ కలర్ జెర్సీలో కనిపించబోతుండడం విశేషం.

click me!

Recommended Stories