అందుకే ఎమ్మెస్ ధోనీని టీ20 వరల్డ్‌కప్‌కి మెంటర్‌గా పెట్టారు... గౌతమ్ గంభీర్ కామెంట్...

First Published Sep 9, 2021, 3:54 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేకుండా మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ ఆడనుంది భారత జట్టు. దీంతో మాహీని మెంటర్‌గా మార్చి, డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసింది బీసీసీఐ. దీనిపై తాజాగా స్పందించాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...

2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్‌లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు...

‘మెంటర్‌గా ధోనీ రోల్ ఏంటో అతనికి అర్థమయ్యేలా చెప్పి ఉంటారని అనుకుంటున్నా. మనకి హెడ్ కోచ్ ఉన్నాడు. అసిస్టెంట్ కోచ్‌లు కూడా ఉన్నారు. బౌలింగ్ కోచ్ కూడా ఉన్నాడు...

విరాట్ కోహ్లీ లేదా రవిశాస్త్రి వారిదగ్గర ఉన్నవాటితో పాటు అదనంగా ఏదైనా కావాలని కోరుకుని ఉండొచ్చు... టీ20 క్రికెట్‌లో టీమిండియా చాలా సక్సెస్ అవుతోంది...

టీ20ల్లో టీమిండియా పెద్దగా కష్టపడింది కూడా ఏమీ లేదు... ఒకవేళ టీ20ల్లో ఫెయిల్ అవుతూ ఉంటే, ఎమ్మెస్ ధోనీలాంటి అనుభవం ఉన్న ప్లేయర్‌ను మెంటర్‌గా కోరుకోవచ్చు. అలాంటి పరిస్థితి ఏమీ లేదు...

అయితే ఎమ్మెస్ ధోనీ మైండ్‌సెట్, టీమిండియాకి చాలా ఉపయోగపడుతుంది. ఉత్కంఠభరితంగా సాగే మ్యాచుల్లో ఒత్తిడిని ఎలా అధిగమించాలో మహేంద్ర సింగ్ ధోనీకి చాలా బాగా తెలుసు...

అందుకే ఆ కారణంగానే ఎమ్మెస్ ధోనీని మెంటర్‌గా ఎంచుకుని ఉంటారు. అంతకుమించి అతనికి ప్రత్యేకమైన అర్హతలేమీ లేవు. ఎందుకంటే టీమిండియా దగ్గర అన్ని స్కిల్స్ అందుబాటులో ఉన్నాయి...

ముఖ్యమైన మ్యాచుల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియక టీమిండియా కీ ప్లేయర్లు ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచుల్లో భారత జట్టు పరిస్థితి దారుణంగా ఉంటోంది...

టీ20ల్లో అత్యంత అనుభవం కలిగిన ఎమ్మెస్ ధోనీ లాంటి కెప్టెన్, మెంటర్‌గా అందుబాటులో ఉంటే... వారికి స్విట్యూవేషన్‌ను ఎలా ఫేస్ చేయాలో బాగా తెలుస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్..

2014 టీ20 వరల్డ్‌కప్, 2015 వన్డే వరల్డ్‌కప్, 2016 టీ20 వరల్డ్‌కప్‌లో నాకౌట్ మ్యాచుల్లో ఓడిన టీమిండియా... 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్‌‌కప్ సెమీస్‌లో ఓడింది...

అయితే మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా, ఆ తర్వాత అతని నాయకత్వంలోనే 2009, 2010, 2012, 2014, 2016 టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీల్లో ఓడింది. 

click me!