దుబాయ్‌లో ధోనీ కుటుంబంతో... చాహాల్, ధనశ్రీలకు మాహీ ట్రీట్...
First Published | Dec 30, 2020, 10:29 AM ISTరిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్ తప్ప, మిగిలిన టోర్నీలకు కూడా దూరంగా ఉంటున్న భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ... అవకాశం దొరికినప్పుడల్లా దుబాయ్‌కి చెక్కేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా పెళ్లి చేసుకున్న భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, ధనశ్రీ వర్మలకు దుబాయ్‌లోనే పార్టీ ఇచ్చారు ధోనీ అండ్ ఫ్యామిలీ. చాహాల్, ధోనీని ఎంతో అభిమానిస్తాడు. అందులో ధోనీ, సాక్షి సింగ్‌లను కలిసిన ఫోటోలను పోస్టు చేసిన చాహాల్... ‘చాలా సంతోంగా ఉంది... ’ అంటూ కాప్షన్ పెట్టాడు. ‘అచ్చం ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది... లవ్‌లీ డిన్నర్‌కి థ్యాంక్ యూ’ అంటూ ధనశ్రీ వర్మ పోస్టు చేసింది.