MS Dhoni: ఐపీఎల్ రిటైర్మెంట్ పై ధోని ఏం చెప్పారో తెలుసా?

Published : May 26, 2025, 12:39 AM IST

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆదివారం తన చివరి మ్యాచ్ ఆడినట్లు కనిపిస్తోందని క్రికెట్ ప్రపంచంలో ఊహాగానాలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఐపీఎల్‌ ఆడటంపై ధోని చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

PREV
17
ఐపీఎల్‌లో ధోని చివరి మ్యాచ్ ఆడారా?

చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం ఈ ఐపీఎల్‌ 2025లో తన చివరి మ్యాచ్ ఆడింది. చెన్నై టీమ్ 83 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ మొదటి నుంచి కెప్టెన్ ఎంఎస్ ధోని  హాట్ టాపిక్ గా మారాడు.

27
ఎంఎస్ ధోని రిటైర్మెంట్ పై క్రికెట్ వర్గాల్లో ఊహాగానాలు

ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు ఎంఎస్ ధోని రిటైర్మెంట్ పై ఎలాంటి సూచన ఇవ్వలేదు. కానీ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ విషయంపై స్పందించారు.

37
వచ్చే ఐపీఎల్ లో ధోని ఆడతారా?

వచ్చే ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడతారా లేదా అనే దానిపై ఎంఎస్ ధోని స్పష్టత ఇవ్వలేదు. ధోని చెసిన కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఫ్యాన్స్ సైతం ధోని కామెంట్స్ తో ఆడతారా లేదా అనే ఆలోచనలో పడ్డారు. 

47
2026 ఐపీఎల్‌లో ఆడటంపై ధోని కామెంట్స్

తన భవిష్యత్తు గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఎంఎస్ ధోని చెప్పారు. వచ్చే నాలుగు, ఐదు నెలల్లో 2026 ఐపీఎల్‌లో ఆడటంపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

‘నా శరీరం సహకరిస్తోంది. ఐపీఎల్ ఆడటం వల్ల కలిగే అలసటను తట్టుకోగలను’ అని ఎంఎస్ ధోని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఆయన ఇప్పుడే రిటైర్ కావడం లేదని స్పష్టమవుతోంది. 

57
చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఏ ఆలోచనలో ఉంది

‘ప్రతి సంవత్సరం కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి వస్తోంది. ముఖ్యంగా నేను కెరీర్ చివరి దశకు చేరుకున్నప్పుడు. శరీరాన్ని బాగుచేసుకోవాలి’ అని ఎంఎస్ ధోని చెప్పారు.

చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఇప్పటివరకు ఎంఎస్ ధోని రిటైర్మెంట్ గురించి బహిరంగంగా వ్యాఖ్యానించలేదు. కానీ ధోని ఆడితే యాజమాన్యం సంతోషిస్తుందని సూచనలే అయితే చేసింది. 

67
ఫిట్‌నెస్‌ను కాపాడుకోగలిగితేనే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ధోని

‘నాకు నిర్ణయం తీసుకోవడానికి నాలుగు, ఐదు నెలల సమయం ఉంది. ఎలాంటి తొందర లేదు. నేను ఉత్తమ స్థితిలో ఉండాలి. క్రికెటర్లు ప్రదర్శన ఆధారంగా రిటైర్ కావడం మొదలుపెడితే, చాలామంది 22 ఏళ్లకే రిటైర్ అవుతారు’ అని ఎంఎస్ ధోని చెప్పారు.

77
వచ్చే ఏడాది ఐపీఎల్‌కు తిరిగి వస్తానని ఎంఎస్ ధోని హామీ ఇవ్వలేదు

‘నేను రాంచీకి తిరిగి వెళ్తాను. బైక్‌పై తిరుగుతాను. నేను కెరీర్ ముగిసిందని చెప్పడం లేదు. తిరిగి వస్తానని కూడా చెప్పడం లేదు. నాకు చాలా సమయం ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను’ అని ఎంఎస్ ధోని అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories