MS Dhoni: రాంచీలో చెన్నై సూప‌ర్ కింగ్స్ రీయూనియన్.. ధోని, సురేష్ రైనా డిన్నర్ పార్టీ అదిరిపోయిందిగా.. !

First Published | Nov 25, 2023, 1:02 PM IST

Chennai Super Kings: ఎంఎస్ ధోనీ ప్రస్తుతం క్రికెట్ మైదానానికి దూరంగా ఉంటూ రాంచీలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడుపుతున్నాడు. 2023 మేలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ధోని నాయ‌క‌త్వంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్  ఐదోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.
 

MS Dhoni, Suresh Raina

Mahendra Singh Dhoni: రాంచీలో చెన్నై సూప‌ర్ కింగ్స్ రీయూనియన్ జ‌రిగింది. భార‌త క్రికెట్ దిగ్గ‌జం, మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని విందు ఇవ్వ‌డంతో ప‌లువురు ఐపీఎల్ చెన్నై జ‌ట్టు ఆట‌గాళ్లు పాలుపంచుకున్నారు. 

భార‌త క్రికెట్ దిగ్గ‌జం ధోనీని సురేశ్ రైనా క‌లుసుకోవ‌డంతో 'చిన్న తాలా, పెద్ద తలా'లను ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశం అభిమానులకు మరోసారి లభించింది. టీం ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)లో ఉన్న సమయంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు వారి టీమ్ గెలుపులో కీల‌క పాత్ర పోషించారు.  లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్ కోసం రాంచీకి వచ్చిన టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా స‌హా ప‌లువురికి ధోనీ, ఆయన సతీమణి సాక్షి విందు ఏర్పాటు చేశారు.  ప్రజ్ఞాన్ ఓజాను కూడా ధోనీ విందుకు ఆహ్వానించాడు.
 


MS Dhoni, Suresh Raina

ఈ విందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. భార‌త జ‌ట్టు, చెన్నై సూప‌ర్ కింగ్స్ కు ఆడిన దిగ్గ‌జ ప్లేయ‌ర్లు ధోనీ, సురేష్ రైనా, సాక్షి ధోని ఒకే ఫ్రేమ్ లో క‌నిపించ‌డంతో క్రికెట్ అభిమాన‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌హేంద్ర సింగ్ ధోనీ, సాక్షి ధోనిలు ఇచ్చిన విందు త‌ర్వాత.. సురేష్ రైనా సోష‌ల్ మీడియాలో స్పందిస్తూ.. 'ధోని భాయ్ గొప్ప విందుకు ధన్యవాదాలు' అని తెలిపాడు. 
 

ఎంఎస్ ధోనీ ప్రస్తుతం క్రికెట్ మైదానానికి దూరంగా ఉంటూ రాంచీలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడుపుతున్నాడు. 2023 మేలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ధోని నాయ‌క‌త్వంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్  ఐదోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.

సురేష్ రైనా ప్రస్తుతం జరుగుతున్న లెజెండ్స్ లీగ్ టీ20 టోర్నీలో పాల్గొంటూ అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. మంగళవారం రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో సదరన్ సూపర్ స్టార్స్‌పై రైనా జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
 

ఆట ముగిసిన తర్వాత, ధోనీ, అతని భార్య సాక్షి తమ ఇంట్లో బుధవారం సురేశ్ రైనాకు విందు ఇచ్చారు. రైనా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్లో అభిమానులతో విందుకు సంబంధించిన ఫొటోల‌ను పంచుకున్నాడు.

Latest Videos

click me!