Indian Cricket Team: ఇటీవల ముగిసిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. వచ్చే వన్డే వరల్డ్ కప్ కు మరో నాలుగేళ్ల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో జట్టు మేనేజ్‌మెంట్ రాబోయే మెగా టోర్నీకి కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. మెన్ ఇన్ బ్లూ జట్టు కెప్టెన్ గా రోహిత్ స్థానాన్ని భర్తీ చేసే ఐదుగురు కీ ప్లేయర్ల ఎవరనేది గమనిస్తే..
కేఎల్ రాహుల్
బ్యాటింగ్, వికెట్ కీపింగ్ సామర్థ్యాలతో కేఎల్ రాహుల్ ఇప్పుడు జట్టుకు కీ ప్లేయర్ గా మారాడు. ఒత్తిడికి గురికాకుండా కూల్ గా ఉండటం అతని సొంతం. ఇదివరకు పలుమార్లు భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. కొంతకాలం ఫామ్ కోల్పోయిన తర్వాత ఆసియా కప్ లో భారత జట్టులోకి బలంగా పునరాగమనం చేశాడు. అప్పటి నుంచి అతని పెర్ఫార్మెన్స్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2023లో జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. రోహిత్ స్థానాన్ని భర్తీ చేసే బలమైన పోటీదారుల్లో కేఎల్ రాహుల్ ఒకరని చెప్పడంలో సందేహం లేదు.
హార్దిక్ పాండ్యా
ఈ స్టార్ ఆల్ రౌండర్ గతంలో టీ20ల్లో భారత కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టాడు. రోహిత్ శర్మకు టీంలో వైస్ కెప్టెన్ గా కూడా ఆడాడు. కెప్టెన్సీ కోసం బీసీసీఐ చూసే ఆటగాళ్లలో హర్దిక్ ముందువరుసలో ఉంటాడని చెప్పడంలో సందేహం లేదు. టీ20ల్లో అతని రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ ఆల్ రౌండర్ వరుసగా గాయలకు గురికావడం సమస్యగా మారింది. ఏదేమైనా భారత వన్డే జట్టు కెప్టెన్సీ రేసులో బలమైన పోటీదారుగా హర్ధిక్ ను పరిగణిస్తున్నారు.
Shreyas Iyer
శ్రేయాస్ అయ్యర్
దూకుడుగా ఆడగలిగే కుడిచేతి వాటం ఆటగాడు.. ఇప్పటికే టాప్ మిడిలార్డర్ లో కీలక ప్లేయర్. భారత జట్టులో ధనాధన్ టాప్ ఇన్నింగ్స్ లతో తన సత్తాను నిరూపించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కెప్టెన్ గా కూడా మంచి ప్రదర్శన చేయడం, కెప్టెన్సీ అనుభవం అతనికి ప్లస్ పాయింట్లుగా చెప్పవచ్చు. ఆటగాళ్ల వయసు, బీసీసీఐ దూరదృష్టితో చూస్తుండటంతో శ్రేయాస్ ను కెప్టెన్ గా నియమించడానికి మంచి ఆప్షన్ అని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జస్ప్రీత్ బుమ్రా
బుమ్రా భారత జట్టులో ప్రధాన పేసర్ మాత్రమే కాదు.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఆటగాడు కూడా. సుదీర్ఘ కాలంగా భారత జట్టులో ఉన్న అనుభవజ్ఞుడైన ప్లేయర్. అంతకు ముందు భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో చారిత్రాత్మక ఐదో మ్యాచ్ లో జట్టుకు సారథ్యం వహించాడు. బుమ్రా ప్రశాంతమైన-దూకుడు వ్యక్తిత్వం, తన బౌలింగ్ తో జట్టును నడిపించే సామర్థ్యం అతన్ని కెప్టెన్సీ రేసులోకి తీసుకువచ్చింది.
Shubman Gill Facts Story Behind Jersey No 77 Favourite Cricketer BFF In Indian Team Net Worth
శుభ్ మన్ గిల్
కేవలం భారత్ కు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ లో శుభ్ మన్ గిల్ ప్రస్తుతం కీ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. పలువురు క్రికెట్ నిపుణులు కూడా అతన్ని తదుపరి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీగా అభివర్ణిస్తుండటం గమనార్హం. అతని అద్భుతమైన ప్రతిభ, ఆకట్టుకునే ప్రదర్శనలు ఇప్పటికే పలువురు అభిమానులను, క్రికెటర్లను మంత్రముగ్ధులను చేశాయి. మూడు ఫార్మాట్లలో భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పటికే భారత్-ఏ జట్టును సమర్థవంతంగా నడిపించిన అనుభవం కూడా అతడికి ఉంది. బీసీసీఐకి దీర్ఘకాలిక ప్రణాళిక ఉన్నందున, గిల్ కు జట్టు కెప్టెన్ గా సుదీర్ఘ అవకాశం ఇవ్వవచ్చు.