ధోనీ సక్సెస్ అంతా ఆ నలుగురు తెచ్చిందేనా? వాళ్లు లేకపోతే మాహీకి కూడా విరాట్ కోహ్లీ గతే పట్టేదా...

First Published Jul 7, 2023, 10:46 AM IST

మహేంద్ర సింగ్ ధోనీ, టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. ధోనీ సారథ్యంలో భారత జట్టు, 2007 టీ20 వరల్డ్ కప్‌తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ గెలిచింది. అయితే ధోనీకి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో హేటర్స్ కూడా అంతేమంది...

2007 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో కానీ, 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కానీ ఆఖరికి 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ ధోనీ బ్యాటు నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ రాలేదు. 2011 వన్డే వరల్డ్ కప్‌లో అయితే ధోనీ, బ్యాటర్‌గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు..
 

ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకున్న ధోనీ, యువీ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. అప్పటికే టోర్నీలో 362 పరుగులు, 15 వికెట్లు తీసిన యువరాజ్ సింగ్, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి ఉంటే... క్రెడిట్ అంతా అతనికే దక్కి ఉండేది. కారణాలు ఎన్ని చెప్పినా టోర్నీలో మొత్తంగా ఫెయిల్ అయిన ధోనీ, వరల్డ్ కప్ క్రెడిట్ కొట్టేయాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకున్నాడని అంటారు యువీ ఫ్యాన్స్..

Latest Videos


ఇది మాత్రమే కాదు, 2007 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో కూడా ధోనీ బ్యాటు నుంచి అదిరిపోయే ఇన్నింగ్స్‌లు రాలేదు. అదీకాక ఫైనల్ మ్యాచ్‌లో 10 బంతులు ఆడి ఒక్క బౌండరీ కూడా కొట్టలేక 6 పరుగులు చేసి ఉమర్ గుల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు మాహీ...
 

2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో అయితే మాహీ డకౌట్ అయ్యాడు. 4 బంతులు ఆడిన ధోనీ, రవి బోపారా బౌలింగ్‌లో పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. అయితే లక్కీగా బౌలర్లు రాణించడంతో టీమిండియా విజయం అందుకుంది..

2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత యువరాజ్ సింగ్ తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. కారణం ఆ మ్యాచ్‌లో యువీ 21 బంతులు ఆడి 11 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. యువరాజ్ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా లేదు.

అయితే ఇదే మ్యాచ్‌లో ధోనీ కూడా 7 బంతులు ఆడి 4 పరుగులే చేశాడు. ఈ ఇద్దరి స్ట్రైయిక్ రేటు 60లోపే ఉంది. అయితే అందరూ యువీనే ఓటమికి బాధ్యుడిని చేశారు..

2016 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో కూడా బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకున్న ధోనీ, 9 బంతులు ఆడి ఒక్క ఫోర్ మాత్రమే బాదాడు. ఓ ఎండ్‌లో విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 89 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేస్తే, ధోనీ నుంచి  అతనికి సరైన సహకారం దక్కలేదు..
 

కెప్టెన్‌గా టీమిండియా సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్న మహేంద్రుడు, భారత జట్టు ఓటముల్లో కూడా ప్రధాన పాత్ర పోషించాడు. అయితే అంతకుముందు, ఆ తర్వాత ఏ కెప్టెన్ కూడా ఐసీసీ టైటిల్ గెలవలేకపోవడంతో ధోనీ ఫెయిల్యూర్‌ని ఎవ్వరూ పట్టించుకోలేదు..
 

గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్.. టీమిండియా గెలిచిన ఐసీసీ టోర్నీల్లో ప్రధాన పాత్ర పోషించిన ప్లేయర్లు వీరే. వీరితోపాటు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్.... ఈ ప్లేయర్లు లేకపోతే టీమిండియా, ధోనీ కెప్టెన్సీలో కూడా 3 ఐసీసీ టైటిల్ గెలిచేది కాదంటారు వీరి ఫ్యాన్స్... 

ధోనీ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీకి యువరాజ్ సింగ్, సెహ్వాగ్, గంభీర్ వంటి మ్యాచ్ విన్నర్లు దొరకలేదు. అదీకాకుండా స్వదేశంలో ఒక్క ఐసీసీ టోర్నీకి కెప్టెన్సీ చేసే అవకాశం కోహ్లీకి దక్కలేదు. ధోనీ సక్సెస్‌కి మంచి టీమ్ దొరకడం కారణమైతే, టెస్టుల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచిన కోహ్లీ, ఐసీసీ టైటిల్ గెలవలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయంటారు అతని అభిమానులు.. 

click me!