చెన్నైకి చేరుకున్న మహేంద్ర సింగ్ ధోనీ... సురేష్ రైనా లేకుండా తొలిసారి చెపాక్‌లో సూపర్ కింగ్స్ మ్యాచ్...

First Published Mar 3, 2023, 3:42 PM IST

ఐపీఎల్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్. ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుని రెండేళ్లు బ్యాన్ పడిన తర్వాత కూడా చెన్నై సూపర్ కింగ్స్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పైపెచ్చు ఇంకా రెట్టింపు అయ్యింది కూడా... అలాంటిది చెన్నైలో గత మూడు సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు సీఎస్‌కే...

కరోనా కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ పూర్తిగా యూఏఈలో జరిగింది. 2021 సీజన్‌ ఇండియాలో జరిగినా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచులు చెన్నైలో జరగలేదు. మధ్యలో కరోనా సెకండ్ వేవ్ రావడంతో మ్యాచులు మళ్లీ యూఏఈకి మారాయి...

ఐపీఎల్ 2022 సీజన్‌కి ఇండియాలోనే నిర్వహించినా మ్యాచులు కొన్ని నగరాలకు మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో 2022లో కూడా చెన్నైలో సీఎస్‌కే మ్యాచులు జరగలేదు. ఎట్టకేలకు మూడేళ్ల విరామం తర్వాత చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచులు జరగబోతుండడంతో బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది...

Latest Videos


అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో తొలి మ్యాచ్ ఆడే చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 3న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడైపోయాయి...

Image credit: PTI

చెపాక్ స్టేడియంలో తన చిట్టచివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడి, తప్పుకుంటానని ప్రకటించాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీంతో మాహీ ఫేర్‌‌వెల్ సీజన్‌లో చెన్నైలో సీఎస్‌కే ఆడే మ్యాచులన్నీ సూపర్ కింగ్స్, ధోనీ సపోర్టర్లతో పసుపు మయం కాబోతున్నాయి.  

అయితే చెపాక్ స్టేడియంలో సురేష్ రైనా లేకుండా మొట్టమొదటి మ్యాచ్ ఆడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన సురేష్ రైనా, 2019 సీజన్ వరకూ సీఎస్‌కే ఆడిన దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ ఆడాడు...
 

Image Credit: Getty Images

2020 సీజన్ నుంచి వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న సురేష్ రైనా, 2021 సీజన్‌లో ఆడి పెద్దగా మెప్పించలేక నాకౌట్ మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ కూడా రైనాని కొనుగోలు చేయలేదు...

మూడు ఐపీఎల్ టైటిల్స్ అందించిన సురేష్ రైనాని చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి కొనుగోలు చేయకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో ‘చిన్నతలా’గా పేరొందిన రైనా లేకుండా చెన్నైలో తొలిసారి మ్యాచ్ ఆడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్.. 

click me!