రేపటి నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్... భారీ ఆశలు పెట్టుకున్న ఫ్రాంఛైజీలు...

Published : Mar 03, 2023, 03:15 PM IST

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌తో మహిళా క్రికెట్‌లో చారిత్రక ఘట్టానికి తెర లేవనుంది. పురుషుల ఐపీఎల్ ప్రారంభమైన 16 ఏళ్లకు మహిళల కోసం ప్రత్యేకంగా పూర్తి స్థాయి లీగ్‌ని తీసుకొచ్చింది బీసీసీఐ. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మార్చి 4న సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు తొలి మ్యాచ్ జరగనుంది...

PREV
18
రేపటి నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్... భారీ ఆశలు పెట్టుకున్న ఫ్రాంఛైజీలు...

ముంబైలోని డీవై పాటిల్ క్రికెట్ స్టేడియం, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 తొలి మ్యాచ్‌కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌కి ముందు బాలీవుడ్ హీరోయిన్లు కృతి సనన్, కియారా అద్వానీలతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే బాలీవుడ్ ర్యాపర్ ఏపీ దిల్లాన్ తన ర్యాంపుతో స్టేజీని మోత మోగించబోతున్నాడు...

28
Image credit: PTI

ఇంతకుముందు పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కి ఆదరణ అస్సలు ఉండేది కాదు. అయితే రెండేళ్లుగా అభిమానుల ఆలోచనలో మార్పు వచ్చింది. పురుషుల క్రికెట్‌తో మ్యాచ్, అమ్మాయిల మ్యాచ్‌లను చూసేందుకు కూడా జనాలు స్టేడియానికి వస్తున్నారు...

38
Image credit: Mumbai Indians

కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్ మ్యాచ్‌లను చూసేందుకు జనం ఎగబడ్డారు. అలాగే ఇండియాలో జరిగిన ఇండియా - ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య టీ20 సిరీస్‌కి కూడా స్టేడియంలో భారత సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు...

48
WPL 2023

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌పై ఐదు ఫ్రాంఛైజీలు భారీ ఆశలే పెట్టుకున్నాయి. డబ్ల్యూపీఎల్ కోసం ప్రత్యేకంగా ‘శక్తి’ పేరుతో మస్కట్‌ని కూడా రూపొందించింది బీసీసీఐ. అంతేకాకుండా ప్రేక్షకులు, మహిళల మ్యాచ్ చూసేందుకు పెద్దగా ఆలోచించకుండా రూ.100, రూ.400 రేట్లలోనే టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది..

58
WPL

అలాగే మహిళలు, అమ్మాయిలకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచులు చూసేందుకు ప్రవేశం ఉచితం. డబ్ల్యూపీఎల్ సక్సెస్ అయితే వచ్చే సీజన్లలో టికెట్ల రేట్లు పెరుగుతాయి. వేలంలో ఆటగాళ్లకు చెల్లించే మొత్తం పెరుగుతుంది...

68

ఫ్రాంఛైజీల పర్సు వాల్యూ పెరిగి, వేల కోట్ల బిజినెస్‌గా మారుతుంది. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నుంచి సాధారణ క్రికెట్ ఫ్యాన్స్ ఆశిస్తున్నది ఇది కాదు. డబ్ల్యూపీఎల్ సక్సెస్ అయితే ధోనీ, విరాట్‌లను చూసి కుర్రాళ్లు బ్యాటు పట్టుకుని క్రికెట్‌పై ఆసక్తి చూపించినట్టుగా... ఆడాళ్ల ఆట వల్ల లాభం లేదని అనుకున్న చాలామంది కళ్లు తెరుచుకుంటాయి...

78

ఎంతో టాలెంట్ ఉన్నా, ఇంట్లో కట్టుబాట్ల కారణంగా క్రికెట్ బ్యాటుని దాచుకున్న అమ్మాయిలు, ధైర్యంగా ముందుకు వచ్చి తమ ఆటను ప్రపంచానికి చూపించడానికి సాహసం చేస్తారు. అమ్మాయిలంటే చదువులోనే కాదు, గ్రౌండ్‌లో అదరగొట్టగలమని నిరూపించేందుకు ఇది ఓ వేదికగా మారుతుంది...
  

88
Image credit: Getty

ఐపీఎల్‌ ద్వారా మారుమూల గ్రామాల్లో ఉంటూ ఎవరికీ తెలియని కుర్రాళ్లు ఎందరో వెలుగులోకి వచ్చి స్టార్లుగా మారారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా భారత మహిళా టీమ్ ఆశిస్తోంది ఇది. టీమిండియా ఆడే 11 మంది ప్లేయర్ల పేర్లు కూడా తెలియని జనాలకు, డబ్ల్యూపీఎల్... ఆడాళ్ల సత్తాని తెలియచేస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్నారు హర్మన్‌ప్రీత్ అండ్ కో.. 

click me!

Recommended Stories