చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెబితే గుర్తొచ్చేవి రెండే రెండు... ఎమ్మెస్ ధోనీ, కిరన్ పోలార్డ్...

First Published Sep 19, 2021, 4:42 PM IST

ఐపీఎల్‌లో ఛాంపియన్స్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఐపీఎల్ 2021 సీజన్‌ ఫస్ట్ హాఫ్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫుల్లు కిక్ ఇవ్వడంతో ప్లేయర్లు కూడా ఈ మెగా బాటిల్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు...

చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో ఇరుజట్ల ఆటగాళ్లను కొన్ని చిలిపి ప్రశ్నలు వేసింది ఐపీఎల్ యాజమాన్యం...

ముంబై ఇండియన్స్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఏమిటంటూ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లను ప్రశ్నించింది. దీనికి దీపక్ చాహార్... ‘ప్రత్యర్థి’ (opponent) అంటూ సమాధానం ఇవ్వగా... సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైక్ హుస్సీ... ‘ఎక్సలెంట్’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు...

చెన్నై సూపర్ కింగ్స్ అనగానే గుర్తుకు వచ్చేది ఏంటంటూ ముంబై ప్లేయర్లను ప్రశ్నించారు.... దీనికి రాహుల్ చాహార్.. ‘ఎమ్మెస్ ధోనీ’ అంటూ సమాధానం ఇచ్చాడు... ట్రెంట్ బౌల్ట్ మాత్రం తనకి రెండు పదాలు గుర్తుకు వస్తాయని, అవి ‘స్టీఫెన్ ఫ్లెమ్మింగ్స్’ అంటూ సమాధానం ఇచ్చాడు.

ముంబై ప్లేయర్ ధవల్ కుల్‌కర్ణి... ‘బ్లాక్‌బస్టర్’ అంటూ సమాధానం ఇవ్వగా, చెన్నై ప్లేయర్ శార్దూల్ ఠాకూర్... ‘పోటీదారులు’ (Rivals) అంటూ సమాధానం చెప్పాడు...

ముంబై ఇండియన్స్ ఓపెనర్ డి కాక్  ‘మరో గన్ టీమ్’ అని చెప్పగా, సీఎస్‌కే ఓపెనర్ డుప్లిసిస్ ‘ఎక్సైటెడ్’ అంటూ సమాధానం ఇచ్చాడు... అన్నింటికీ మించి సూర్యకుమార్ యాదవ్ చెప్పిన సమాధానం అందర్నీ ఆకట్టుకుంది...

సీఎస్‌కే పేరు చెప్పగానే తనకి... ‘భయంకరమైన పోటీదారులు’ అనే పదం గుర్తుకు వస్తుందని, దానితో పాటు ఇదిగో ఈ వ్యక్తి... గుర్తుకు వస్తాడంటూ కిరన్ పోలార్డ్‌ను పిలిచి మరీ చూపించాడు సూర్యకుమార్ యాదవ్...

సీఎస్‌కే ఆల్‌రౌండర్ డీజే బ్రావో... ‘సక్సెస్’ అని ముంబైని పొగడగా, ముంబై ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్... ‘ఎల్ క్లాసికో’ అంటూ తేల్చేశాడు... రవీంద్ర జడేజా మాత్రం ముంబైని ‘చాలామంది బలమైన ఆల్‌రౌండ్ టీమ్’ అన్నాడు...

ముంబై వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా సీఎస్‌కే అంటే ‘ఎమ్మెస్ ధోనీ’ అంటూ కామెంట్ చేయగా, సీఎస్‌కే ప్లేయర్లు రుతురాజ్ ‘పవర్ హౌజ్’, మొయిన్ ఆలీ ‘నిలకడ’ (కన్సిస్టెన్సీ), ఇంగిడి ‘పోటీ’ అంటూ కామెంట్లు చేశారు...

ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా... ‘సీఎస్‌కేతో ఆడడం ఎప్పుడూ పోటీపోటీగా ఉంటుందంటూ’ చెప్పగా... కృనాల్ పాండ్యా కూడా సీఎస్‌కే అనగానే ‘కిరన్ పోలార్డ్’ గుర్తుకు వస్తాడని చెప్పాడు...

ఐపీఎల్ 2021 ఫస్ట్ ఫేజ్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు కిరన్ పోలార్డ్...

బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన పోలార్డ్, సీఎస్‌కే విధించిన 219 పరుగులు లక్ష్యఛేదనలో 34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో ఆఖరి ఓవర్‌ ఆఖరి బంతిదాకా నిలిచి, ముంబై ఇండియన్స్‌కి విజయాన్ని అందించాడు...

click me!