EL Clasico... రోహిత్ శర్మ వర్సెస్ ధోనీ టీమ్‌ల మధ్య మ్యాచ్‌కి ఎందుకింత క్రేజ్...

First Published Sep 19, 2021, 3:39 PM IST

ఐపీఎల్ చరిత్రలో ఏ మ్యాచులకీ రానంత క్రేజ్... ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌కి ఉంటుంది. ముంబై, చెన్నై టీమ్‌లకు సపోర్ట్ చేయనివాళ్లు కూడా ఈ రెండు టీమ్‌ల మధ్య మ్యాచ్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు... అలా ఈ మ్యాచ్‌కి ఇంతగా క్రేజ్ రావడానికి కారణమేంటి?

చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ గురించి ఒక్క మాటలో చెప్పమని అడిగినప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, ముంబై ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్... ‘ఎల్ క్లాసికో’ (El clasico) అంటూ చెప్పారు...

ఫుట్‌బాల్‌లో బార్సిలోనా, రియాల్ మాడ్రిడ్ మధ్య మ్యాచ్‌ని ఇలా ఎల్ క్లాసికో అని పిలుస్తారు. క్రికెట్‌లో, అదీ ఐపీఎల్‌లో అలాంటి నేమ్‌, ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్‌లకు దక్కింది....

ఐపీఎల్‌లో ఐదు సార్లు టైటిల్ గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్... ఆ తర్వాతి స్థానం చెన్నై సూపర్ కింగ్స్. బ్యాడ్‌లక్ కారణంగా రెండేళ్లు బ్యాన్ పడింది కానీ, ఆ సీజన్లలో కూడా ఆడి ఉంటే, మా  ఖాతాలో కూడా ఐదు టైటిల్స్ ఉండేవంటారు కొందరు సీఎస్‌కే ఫ్యాన్స్...

మాహీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్‌కి ఐపీఎల్‌లో మిగిలిన అన్ని జట్లపై ఘనమైన రికార్డు ఉంటే, ముంబై ఇండియన్స్‌కి సీఎస్‌కేపై అదిరిపోయే రికార్డు ఉంది...

ఐపీఎల్‌లో మొత్తంగా ఈ రెండు జట్ల మధ్య 33 మ్యాచులు జరిగాయి. ఇందులో గ్రూప్ మ్యాచులు పోగా ప్లే ఆఫ్స్‌లో 9 సార్లు, ఫైనల్స్‌లో నాలుగు సార్లు ముంబై, చెన్నై జట్లు తలబడ్డాయి...

ఐపీఎల్‌ లీగ్ ప్రారంభంలో ముంబై, చెన్నై మధ్య నాలుగుసార్లు మ్యాచులు జరిగాయి. వీటిల్లో అత్యధికంగా 20 మ్యాచుల్లో విజయాలు అందుకుంది ముంబై ఇండియన్స్... సీఎస్‌కేకి 13 మ్యాచుల్లో విజయాలు దక్కాయి...

2010 ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి, టైటిల్ కైవసం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్... సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో తొలిసారి ఫైనల్ చేరిన ముంబై, టైటిల్ సాధించలేకపోయింది...

అయితే ఆ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది... రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్...

ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్ అయితే ఎవ్వరూ మరిచిపోలేరు. ఐపీఎల్ 2021 సీజన్‌ ఫస్ట్ ఫేజ్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ లాంటి మజాని అందించింది... 

ఆఖరి ఓవర్‌, ఆఖరి బంతి వరకూ సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, ఘన విజయాన్ని అందుకుంది. కిరన్ పోలార్డ్, చివరి వరకూ క్రీజులో నిలిచి ఒంటిచేత్తో గెలిపించాడు...

అందుకే ఈసారి కూడా ఐపీఎల్ ఫేజ్ 2 ప్రారంభమ్యాచ్‌గా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌ను సెట్ చేశారు ఐపీఎల్ నిర్వహాకులు... ఈ మ్యాచ్ అయితే క్రికెట్ ఫ్యాన్స్‌ని ఏ మాత్రం డిస్సపాయింట్ చేయదని వారి నమ్మకం...

ముంబై ఇండియన్స్‌కి జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి టాప్ క్లాస్ బౌలర్లతో నిండిన బౌలింగ్ లైనప్ ఉంది. అయితే చెన్నైలో వారి బౌలింగ్‌లో బౌండరీల మోత మోగించగల సురేష్ రైనా, మొయిన్ ఆలీ, ఎమ్మెస్ ధోనీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా వంటి బ్యాట్స్‌మెన్ పుష్కలంగా ఉన్నారు...

చెన్నై సూపర్ కింగ్స్‌లో ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల దీపక్ చాహార్, సామ్ కుర్రాన్, శార్దూల్ ఠాకూర్ వంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. అయితే ఎటువంటి బౌలర్‌కైనా వెన్నులో వణుకుపుట్టించగల కిరన్ పోలార్డ్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, డి కాక్ వంటి బ్యాట్స్‌మెన్ ముంబై ఇండియన్స్‌లో ఉన్నారు...

మిగిలిన జట్టలో కూడా స్టార్లు ఉండొచ్చు, అరవీర భయంకర బౌలర్లు, భారీ సిక్సర్లు కొట్టగల హిట్టర్లు ఉండవచ్చు కానీ ముంబై ఇండియన్స్, సీఎస్‌కే ప్లేయర్లు ఓన్ చేసుకుని ఆడినట్టుగా వాళ్ల పర్ఫామెన్స్ ఉండదు. అందుకే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌కి అంత క్రేజ్...

click me!