జస్ప్రిత్ బుమ్రాకి 100వ ఐపీఎల్ మ్యాచ్... ముంబై ఇండియన్స్ నుంచి ఆరో ప్లేయర్‌గా...

First Published Sep 19, 2021, 4:00 PM IST

ఐపీఎల్‌లో మిగిలిన ఫ్రాంఛైజీలకంటే ముంబై ఇండియన్స్‌కి ఆడడం చాలా అదృష్టంగా భావిస్తుంటారు క్రికెటర్లు. ఎందుకంటే ముంబై ఇండియన్స్‌కి ఆడిన ప్లేయర్లలో చాలామందికి టీమిండియా తరుపున ఆడే అవకాశం వచ్చింది. అలా ముంబై ఇండియన్స్ నుంచి టీమిండియాలోకి దూసుకొచ్చిన స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా...

2013లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌ ద్వారా ఐపీఎల్ ఆరంగ్రేటం చేశాడు జస్ప్రిత్ బుమ్రా. అప్పుడు బుమ్రా వయసు 19 ఏళ్లు మాత్రమే...

తొలి మ్యాచ్‌లోనే అదిరిపోయే బౌలింగ్ పర్ఫామెన్స్ ఇచ్చిన బుమ్రా, 32 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు... ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు బుమ్రా... 

బుమ్రా ఆరంగ్రేటం చేసిన సీజన్‌లోనే అదృష్టం కలిసివచ్చినట్టుగా ఐపీఎల్‌లో మొట్టమొదటి టైటిల్‌ని సాధించింది ముంబై ఇండియన్స్... అది మొదలు, బుమ్రాను వదులుకోవడానికి ముంబై ఇండియన్స్‌ ఏనాడూ సాహసించలేదు... బుమ్రాకి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమూ రాలేదు..

మొదటి సీజన్‌లో కేవలం రెండు మ్యాచుల్లోనే బుమ్రాను ఆడించిన ముంబై ఇండియన్స్, ఆ తర్వాతి ఏడాది 11 మ్యాచుల్లో ఆడించింది. అయితే 2014లో బుమ్రా కేవలం 5 వికెట్లు మాత్రమే తీయగలిగాడు...

2015లో కేవలం 4 మ్యాచులే ఆడిన బుమ్రా, 2016 నుంచి రాటుతేలి, ముంబై ఇండియన్స్‌కి కీ బౌలర్‌గా మారిపోయాడు... 2016 సీజన్‌లో 15 వికెట్లు తీసిన బుమ్రా, 2017లో 20 వికెట్లు పడగొట్టాడు...

2018లో 17 వికెట్లు, 2019లో 19 వికెట్లు తీసిన బుమ్రా... గత సీజన్‌లో అత్యధికంగా 27 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచాడు...

సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రాకి రెస్ట్ ఇచ్చింది ముంబై ఇండియన్స్... లేదంటే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి, పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకునేవాడే...

ముంబై ఇండియన్స్ తరుపున 100 ఐపీఎల్ మ్యాచులు ఆడబోతున్న ఆరో ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు జస్ప్రిత్ బుమ్రా... ఐపీఎల్‌లో ఏ ఫ్రాంఛైజీ తరుపున కూడా ఇంత మంది 100కి పైగా మ్యాచులు ఆడింది లేదు...

ముంబై ఇండియన్స్ తరుపున ఇంతకుముందు హర్భజన్ సింగ్, లసిత్ మలింగ, అంబటి రాయుడు 100కు పైగా మ్యాచులు ఆడగా... ప్రస్తుత ప్లేయర్లు కిరన్ పోలార్డ్ 150కి పైగా మ్యాచులు ఆడాడు...

కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ తరుపున 160కి పైగా మ్యాచులు ఆడాడు. సీఎస్‌కే తరుపున ధోనీ, రైనా, జడేజా... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, యజ్వేంద్ర చాహాల్ వందకు పైగా మ్యాచులు ఆడారు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున గౌతమ్ గంభీర్, సునీల్ నరైన్, యూసఫ్ పఠాన్ ఈ ఫీట్ సాధించగా... రాజస్థాన్ రాయల్స్ తరుపున అజింకా రహానే మాత్రమే 100కి పైగా మ్యాచులు ఆడాడు...

ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరుపున ఇప్పటిదాకా ఒక్క ప్లేయర్ కూడా 100కి పైగా మ్యాచులు ఆడిన రికార్డు క్రియేట్ చేయకపోవడం విశేషం...

click me!