నేను చూసిన బెస్ట్ ఫినిషర్ అతనే... సౌతాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్...

First Published Jun 3, 2021, 4:45 PM IST

ఐపీఎల్‌లో అతి తక్కువ అవకాశాలు అందుకున్న స్టార్ ప్లేయర్లలో డేవిడ్ మిల్లర్ ఒకడు. రాజస్థాన్ రాయల్స్‌ జట్టుకి చెందిన ఈ స్టార్ బ్యాట్స్‌మెన్, గత సీజన్‌లో తుదిజట్టులో పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయాడు. అయితే ఈ సారి అతనికి ఆ అవకాశం దక్కింది.

ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మొదటి మ్యాచ్‌లో గాయపడి దూరం కావడం, ఆ తర్వాత సామ్ బిల్లింగ్స్, ఆండ్రూ టై వంటి ప్లేయర్లు కూడా స్వదేశానికి వెళ్లిపోవడంతో సీజన్‌ 2021లో ఆరు మ్యాచులు ఆడాడు డేవిడ్ మిల్లర్.
undefined
ఓ మ్యాచ్‌లో 62 పరుగులతో అదరగొట్టిన మిల్లర్, మొత్తంగా 102 పరుగులు చేశాడు. 2012 నుంచి ఐపీఎల్ ఆడుతున్న డేవిడ్ మిల్లర్, గత సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. తాజాగా అభిమానులతో ముచ్ఛటించిన మిల్లర్, కొన్ని ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.
undefined
‘ఎమ్మెస్ ధోనీ గురించి కొన్ని విషయాలు చెప్పండి’ అంటూ ఓ అభిమాని, డేవిడ్ మిల్లర్‌ను కోరాడు. దీనికి సమాధానం ఇచ్చిన మిల్లర్... ‘నా ఫేవరెట్ క్రికెటర్లలో మాహీ కూడా ఒకడు. నేను చూసిన బెస్ట్ ఫినిషర్ అతనే. ఎంతో వినయంగా ఉంటాడు. అతని కామ్ అండ్ కూల్ ప్రవర్తన నాకెంతో ఇష్టం’ అంటూ కామెంట్ చేశాడు.
undefined
తన క్రికెట్ కెరీర్‌లో 47 సార్లు నాటౌట్‌గా నిలిచి, ఎన్నో మ్యాచ్‌లను ఫినిష్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తూ 10 వేల వన్డే పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన మాహీ, విజయవంతమైన చేధనల్లో 2876 పరుగులు చేశాడు.
undefined
అయితే సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్‌ను కాదని మహేంద్ర సింగ్ ధోనీని బెస్ట్ ఫినిషర్ అంటూ కామెంట్ చేయడంపై ఏబీడీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మిస్టర్ 360’ని ఎలా మరిచిపోయావంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
undefined
భారత జట్టు కంటే ఐపీఎల్‌లో విశ్వరూపం చూపించే మహేంద్ర సింగ్ ధోనీ, 2019 సీజన్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదుచేయలేకపోయాడు. గత సీజన్‌లో బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గానూ ఫెయిల్ అయ్యాడు.
undefined
అయితే ఈ సీజన్‌లో సీఎస్‌కే టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. అయితే సీజన్‌లో సీఎస్‌కే తరుపున అదరగొట్టిన మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్ వంటి ప్లేయర్లు సెప్టెంబర్‌లో తిరిగి ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచులకు రావడం అనుమానంగా మారింది.
undefined
ఈ ఇద్దరూ టాప్ క్లాస్ పర్ఫామర్లు రాకపోతే చెన్నై సూపర్ కింగ్స్ పర్ఫామెన్స్ పడిపోతుందేమోనని ఫ్యాన్స్ భయపడుతున్నారు. యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020లో సీఎస్‌కే తొలిసారి ఫ్లేఆఫ్‌కి అర్హత సాధించలేక ఏడో స్థానంతో సీజన్‌ను ముగించింది.
undefined
click me!